#


Index

ఉపోద్ఘాతము భగవద్గీత

అలాగే చేశారు తన కాలంలో ఎటు వచ్చీ అద్వైత మార్గాన్ని అనుసరిస్తూనే చెప్పాలి ఏ భావం చెప్పినా. దానికి మాత్రం విరుద్ధంగా మాటాడ గూడ దెప్పుడూ.

  అలాగే నేను ప్రతి అధ్యాయానికీ మొదటా చివరా దాని సారాంశం చెబుతూ అధ్యాయానికీ అధ్యాయానికీ ఉన్న సంబంధం బయటపెడుతూ అధ్యాయ మధ్యంలో శ్లోకానికీ శ్లోకానికీ నడుమ ఉన్న సాంగత్య మేమిటో అదీ వివరిస్తూ వ్యాఖ్యానం వ్రాయటం జరిగింది. అక్కడక్కడా విషయాన్ని వివరించేటప్పుడు చెప్పినదే మరలా చెప్పి ఉండవచ్చు. అది పునరుక్తి దోషం కాదు. వేదాంత విద్యలో పునరుక్తి అనేది దోషం కాదని ఆచార్యుల వారే తమ భాష్యంలో ప్రస్తావించా రక్కడక్కడా. దుర్బోధత్వా దాత్మ వస్తునః ఆత్మ జ్ఞాన మనేది అంత దురవగాహమైనది. అందుకోసం అనేక మార్గాలలో మాటి మాటికీ బోధించట మవసర మంటా రాయన. అది కూడా సందర్భం వచ్చినప్పుడే చెప్పాలిగాని కావాలని పని గట్టుకొని చేయరాదు. ప్రస్తుతం నేను కూడా జగద్గురు బోధ ననుసరించి సందర్భాను సారంగానే అలా వివరిస్తూ వచ్చాను. జీవితానికి పనికి వచ్చే అద్భుతమైన అధ్యాత్మ జ్ఞాన మెన్ని కోణాలలో చూచి అందిస్తే అంత మంచిది. ఎన్నిమార్లు దానిని శ్రవణం చేస్తే అంత ఫలప్రదం.

  ఇంత కన్నా నేను చెప్పే దేముంది. ఇది మీరు శ్లోకాలతో కలిపి చదివినా సరే. వదిలేసి నా వ్యాఖ్యానం మాత్రమే చదువుతూ పోయినా సరే.