ఉపోద్ఘాతము
భగవద్గీత
పరిశీలించి చాలా వరకు తప్పులు లేకుండా తయారు చేయించానీ షట్కం. మీరూ చూడండి. ముద్రారాక్షసాలున్నాయో లేవో మేము గాదు. మీరివ్వాలి మాకు సర్టిఫికేటు.
అచ్చు కూడా నేను చాలా పెద్ద టైపే వేయిస్తున్నాను మొదటి నుంచీ. పంక్తీకీ పంక్తికీ మధ్య ఖాళీ కూడా ఎక్కువగానే పాటిస్తూ వచ్చాను. సాధారణంగా ఇలాటి గ్రంథాలు వయసు మళ్లిన వారే ఎక్కువగా చదువుతారు కాబట్టి వారి కనుకూలంగా ఉంటుందని అలా చేయవలసి వచ్చింది.
ఇక గ్రంథ విషయానికి వస్తే ప్రతి అధ్యాయానికీ వ్యాఖ్యానం వ్రాసేటప్పుడు నేను తరుచుగా భగవత్పాదుల భాష్యమే ప్రమాణంగా తీసుకొని భాష్యపంక్తు లుదాహరించి వాటి అర్థం కూడా వివరిస్తూ వచ్చాను. అంతేగాక దేశకాలాలను బట్టి స్వతంత్రంగా కూడా ఎంతో భావన చేసి గీతా తాత్పర్యాన్ని బయటపెడుతూ వచ్చాను. అప్పుడే దాని విశ్వజనీనత ఏదో పాఠకులు చక్కగా గుర్తించగలరు. సంప్రదాయానికి కట్టుపడ్డా గుడ్డిగా అనుసరించగూడదు. స్వతంత్రంగా భావించ గలిగి ఉండాలి. అద్వైత విజ్ఞాన మంటే అది దేశకాలా ద్యవధుల కతీతం. త్రైకాలికమైన సత్యం. భగవత్పాదులు కూడా తన దేశకాలాదుల ననుసరించి కొన్ని భావాలు సమర్థించవలసి వచ్చింది. అది ఇప్పటి వారికి కొంచెం సంకుచితంగా కనిపించవచ్చు. కాబట్టి భౌతికశాస్త్ర విజ్ఞాన మెక్కువగా సాగుతున్న ఈ రోజులలో ఆనాటి అభిప్రాయాలు ఈనాటి కనుగుణంగా కొన్ని సవరించి చెప్పటం తప్పుగాదు. భగవత్పాదులు కూడా