దానిమేరకే చూడడు. తన చైతన్యమే అలా విస్తరించి మరొక వేషంలో తనకే దర్శన మిస్తున్నదని ఒక అలౌకికమైన అనుభూతిని పొందుతుంటాడు వాడు. వాడే ప్రహ్లాదుడూ కుచేలుడూ.
పోతే పరం భావ మజానంతః. అలాటి పరతత్త్వాన్ని గుర్తించలేని
బేలకు శరణ్యమిక అపరమైన భగవద్రూపమే. అయితే అది Next Best
అన్నట్టు తాత్కాలికమే గాని నిత్యం కాదు. కారణమే మంటే పరతత్త్వం
లాగా అవ్యయము అనుత్తమమూ కాదది. వ్యయమంటే ఎప్పటి
కప్పుడు మారిపోవటం. నామరూపాత్మకంగా చూస్తే పరమాత్మ మారకే
మవుతాడు. అవతారాల లాంటివే వచ్చాయి పోయాయంటే అది మారటమే
గదా. రాకపోకలే మారటం. మారటమే మరణం. ఎలాటి మార్పూ
లేకుండా అవ్యయంగా ఉన్నప్పుడే అనుత్తమం కూడా అవుతుంది తత్త్వం.
దేనికన్నా ఉత్తమం లేదో అది అనుత్తమం The Supreme summum bonum.
అంటారు పెద్దలు. అలాంటి పరతత్త్వాన్ని పట్టుకొంటే ఈ సాధకుడూ
దానిలాగే అనుత్తముడూ అవ్యయుడూ అనిపించుకొని ముక్తు డవుతాడు
గాని అలా కాక దాని వ్యక్తమైన రూపాలను వాటినీ వీటినీ పట్టుకొని
ప్రాకులాడితే ఎలా కాగలడు. కాకుంటే సంసారమనే సమస్య ఎలా
తొలగిపోతుంది. తొలగక పోగా ఇంకా ఆ దేవలోకాలకూ ఈ మానవ
లోకానికీ రాకపోకలు సాగించలేక సమస్య నింకా ద్విగుణీకృతంగా
పెంచుకొన్న వాడవుతాడు.
Page 87