#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

సర్వగత మది. మరి ఈ అవతారాలూ దేవతామూర్తులూ ఇవన్నీ ఏమిటి. దాని ఆభాసలేగాని అదిగాదు. వస్తువు వేరు. దాని ఆ భాస లేవేని మొదటినుంచీ ఏకరువు పెడుతూనే ఉన్నాము. ఆ భాస వస్తువుకు చెందినదే గాని వస్తువుగాదు. వస్తువని చూస్తే సత్యమే Actual or real. తద్వ్యతిరిక్తంగా చూస్తే మాత్రం సత్యం కాదు. అనృతం Unreal false. ఊరక మన భావనే Notionగాని దాని కనురూపంగా అక్కడ పదార్థం లేదు. అందుకే సర్వం నామరూపాది సదాత్మ నా సత్యం - స్వతస్తు అనృతమేవ అని కుండబద్దలు గొట్టినట్టు గట్టిగా చాటి చెప్పారు భగవత్పాదులు ఛాందోగ్య భాష్యంలో.

  అంచేత వస్తు వవ్యక్తమైతే అది వ్యక్తమయి కనిపించట మాభాస. కనీసం వస్తు దృష్టితోనైనా చూడక ఆ భాసనే వస్తువని చూస్తున్నారు నూటికి తొంభయి మంది. లోకులే గాదు. భక్తులూ యోగులూ ఉపాసకులు కూడా ఇలాంటి వారే. వీరందరూ అబుద్ధయః బుద్ధిహీనులు పొమ్మంటున్నది భగవద్గీత. ఏది వాస్తవమో ఏది దాని ఆభాసో వివేచన చేసి చూచే తెలివి తేటలు లేనివారని అర్థం. ఇలాటి అవివేక దృష్టి వీరి కేర్పడిందంటే దానికేమి కారణం. పరంభావ మజానంతః అని సమాధాన మిస్తున్నది. పరమని అపరమని పరమాత్మకు రెండు రూపా లున్నాయి. అందులో పర మనేది అవ్యక్తమైన శుద్ధ చైతన్యం. ఆకాశంలాగా సర్వగత మది. చేతనైతే దాన్నే పట్టుకోవచ్చు ఆత్మ రూపంగా. ఉత్తమాధికారి అయిన సాధకుడలాగే చూస్తాడు. వాడికా దేవతలూ లేరు. అవతారాలూ లేవు. విగ్రహాలూ లేవు. ఏ గొడవా లేదు. ఏదైనా మనసుకు వచ్చినా దాన్ని

Page 86

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు