విభాగజ్ఞతయా విహితాన్ నిర్మితాన్ అని. సర్వజ్ఞు డీశ్వరుడే గాని దేవతలు కూడా అల్పజ్ఞులూ అల్పశక్తులూ అని తేటపడుతున్నదీ మాట వల్ల మనకు.
అంతవత్తు ఫలం తేషాం - తద్భవ త్యల్పమే ధసాం
దేవాన్ దేవయజో యాంతి - మద్భక్తా యాంతి మామపి - 23
ఇంతకూ సర్వజ్ఞుడనూ సర్వసమర్థుడనూ అయిన నేనే ఇవ్వాలిగాని ఏ ఫలమైనా తామనుకొన్న ఏదేవతలూ కారనే మేధాశక్తి లేదీ భక్తులకూ ఉపాసకులకూ. అంచే తనే నన్ను వదిలేసి నా చైతన్యశకలాలైన దేవతలను పట్టుకొని అక్కడి కాగిపోతున్నారు. ఒకవేళ వారివల్ల తమ కొక కోరిక ఫలిస్తున్నా శకలమైన ఆ దేవత ఇచ్చే ఫలమది కూడా శకలమేగాని సకల మెలా అవుతుంది. అంత వత్తు ఫలం తేషాం తద్భవతి. సాంతమే Finite అవుతుంది ఆ ఫల మనంతం Infinite కాబోదు. అది గ్రహించలేని ఈ ఉపాసకులెంత అల్పబుద్ధులు. అల్పమే ధసః - నిజంగా వారికున్న బుద్ధిబల మల్పాల్పమైనది. లేకుంటే అనంత ఫలాన్ని ప్రసాదించే నన్ను విడిచిపెట్టి వాళ్లను పట్టుకొంటారా. వారు నా గుమాస్తాలు. నేను సర్వాధికారిని. అధికారిని చూడకుండా గుమాస్తాలకు లంచమిచ్చి పని జరుపుకోవాలని చూచేవాడెంత తెలివి తక్కువవాడు. వాడు సర్వజ్ఞుడు. వాడి కన్ను మొరగి ఎవడే పని చేయగలడు. అటు దేవతలనూ ఇటు మానవులనూ - వీరి బుద్ధులనూ - వీరి నడతలనూ - అన్నిటినీ కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు వాడు. కాబట్టివాడి అనుమతి లేకుండా ఏ దేవతా మనకు వరమివ్వనూ లేదు. మనం దాన్ని పుచ్చుకోనూ లేము.
Page 83