నారాధిస్తే వారివ్వాలి గాని వరాలు ఈశ్వరు డివ్వట మేమిటి. వారికా దృష్ఠి లేదు గదా.
నిజమే వారికి లేకపోవచ్చు దృష్టి. కాని ఈశ్వరుడి కుంది బ్రహ్మాండమైన దృష్టి వారిమీద. వారారాధించే దేవతా మూర్తులమీద. వీరూ వారూ ఎక్కడున్నా రసలు. ఆ యీశ్వరుడి విభూతే గదా. మహా అయితే ఆయన కుపాధులా దేవతలు. నదీ జలానికి పెద్ద పెద్ద పంపులైనుల లాంటి వారు ఇంద్రాది దేవతలైతే ఆ పంపులలో నుంచి వచ్చే జలాన్ని పట్టి నింపుకొనే తొట్లలాంటివి మానవ జీవితాలు. వారి బుద్ధులు. చైతన్యగంగా ప్రవాహ మీశ్వరుడంటే. అదే జ్ఞానశక్తీ. అదే క్రియా శక్తీ. అది ప్రసరించటాని కొక ప్రణాళికల వంటివీ దేవతా విగ్రహాలనేవి. మన బుద్ధులీ ప్రసరించే ప్రణాళికల వరకే ఎదిగి ఆగిపోతున్నాయి. కాని ఆ ప్రవాహ మెక్కడి నుంచి వస్తున్నదా ఈ ప్రణాళికలకు సరఫరా ఎక్కడి నుంచా అని ఆ మూల స్థానం వరకూ ఎదిగి చూడటం లేదు. మనం చూడలేక పోయినా ఆ ప్రణాళికలకు కొంత అర్థమయినా కాకపోయినా అదొకటున్నది మూలస్థానమని సర్వజ్ఞాన సంపన్నమైన దానికెప్పుడూ ఎరుకే. అదే ఎప్పు డెవరికే ది పంచిపెట్టాలో ఏ దేవత అనే ఉపాధి ద్వారా దాన్ని అందజేయాలో ఒక ప్లాను ప్రకారం చేస్తూ పోతుంది. మయైవ అంటే అర్ధమది. దేవతలు గారు వారి ద్వారా ఇస్తున్నది నేనంటున్నాడు. అదే వివరిస్తున్నారు భాష్యకారులు. మయైవ పరమేశ్వరేణ సర్వజ్ఞేన కర్మఫల
Page 82