#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

కనిపిస్తున్న దా యా దేవతా రూపాలుగా. అదే వారి శ్రద్ధా భక్తులుగా తత్త ద్దేవతా రాధనగా భాసిస్తుంటుంది. ఆ మేరకది సత్యమే. అనృతం కాదు. అనృత మెప్పుడంటే సత్యమనే ఆధారం కోలుపోతే. కోలుపోయే ప్రశ్న లేదెప్పుడూ. సత్య మనృతాని కెప్పుడూ అధిష్ఠాన మయ్యే ఉంది. ఎటు వచ్చీ అధిష్ఠాన దృష్టి ఉన్న వాడి కసలైన ఈశ్వరుడే సత్యం. అది లేనివాడి కాయన విభూతి మాత్రమే సత్యం.

  కనుకనే ఉపాసకులిదే సత్యమని భావించి సతయా శ్రద్ధయా యుక్తః శ్రద్ధా భక్తులతో తస్యారాధన మీహతే. ఆయా దేవతోపాసన ఏమరకుండా సాగిస్తుంటారు. ఆ దేవతలే తాము కోరిన కోరికలన్నీ సఫలం చేస్తారని ఆశ పడుతుంటారు. అంతే కాదు. వారి భావాలకు తగినట్టే ఆ దేవతలు కూడా వారి కవి ప్రసాదిస్తుంటారు. లభతే చ తతః కామాన్. వారి వల్ల తాము కోరిన ధన కనక వస్తువాహన పుత్ర కళత్ర క్షేత్రాది భోగాలన్నీ వారు యధేచ్ఛగా పొందుతారు. అనుభవిస్తుంటారు. సందేహం లేదు. కాని రహస్య మేమంటే ఆ దేవతలు కాదు వారికా కోరికలన్నీ నెరవేర్చటం. వరాలు ప్రసాదించటం. మరి ఎవరు. మయైవ విహితాన్ హి తాన్. నేనే వారికవి అనుగ్రహిస్తున్నా నంటాడు పరమాత్మ. ఏమిటీ మాట. వారు దేవతలను ఆరాధిస్తే పరమాత్మ వారి ననుగ్రహించట మేమిటి. ఇంతకూ దేవతలా పరమేశ్వరుడా ఫలదాత. పరమేశ్వరుణ్ణి కాదు గదా వారా రాధించింది. ఇంద్ర వరుణాది దేవతా మూర్తులను. అలాంటప్పుడెవరి

Page 81

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు