#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

భావించినప్పుడే ఆయన ఆయా రూపాలు ధరించి కనిపిస్తుంటాడు. మన భావాని కనుగుణంగానే శ్రద్ధా భక్తులు వారి మీద ఉండేలాగా చూస్తున్నట్టు భాసిస్తుంటాడు. యే యధామా మన్నట్టు మన దృష్టిని బట్టే ఈశ్వరుడి సృష్టి. దృష్టి ఈశ్వరాత్మకంగా మారితే సృష్టి లేదు. తాడు తాడుగా కనిపించినట్టే ఈశ్వరు డీశ్వరుడుగానే సాక్షాత్కరిస్తాడు. అప్పుడిక సర్పధారాదులు లేనట్టే ఇంద్ర వరుణాది దేవతలు లేరు. వారి ఆరాధనా లేదు. ఈశ్వరుడ లాటి భావాలు మనకు కల్పించటమూ లేదు. అంతా వట్టిదే. వ్యావహారికంగా సర్వమూ ఉంది. పారమార్ధికంగా ఏదీ లేదు. ఇదే మనం తెలుసుకో వలసిన అద్వైత విద్యా రహస్యం.

స తయా శ్రద్ధయా యుక్త - స్తస్యా రాధన మీహతే
లభతే చ తతః కామాన్ - మయైవ విహి తానో హి తాన్ - 22


  అంచేత ఇప్పుడీ దేవతా భక్తులంతా ఈశ్వరుణ్ణి మరచిపోయి తదీయ విభూతి శకలాలైన దేవతా మూర్తులను పట్టుకొని కూచున్నారంటే వారందరూ పారమార్ధికంలో లేరు. పారమార్ధిక మను కొంటూ వ్యావహారిక క్షేత్రంలోనే తిరుగుతున్నారు. అయినా ఒక విశేష మేమంటే వారి బుద్ధికి తగినట్టే వారి కామూర్తుల మీద శ్రద్ధా - శ్రద్ధకు తగినట్టే ఆరాధనా ఏర్పడుతుంటాయి వారికి. వ్యావహారికమైనా తాత్కలికంగా వారికిది పారమార్ధికమే. కాకున్నా వ్యావహారిక మనేది వేరే ఎక్కడ ఉంది. ఉన్నదొక్క పారమార్ధికమైన భగవత్తత్త్వమే గదా. అదే వారి దృష్టి కనురూపంగా

Page 80

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు