కాబట్టి మారవచ్చు చేయవచ్చు. శుద్ధ చైతన్య స్వరూపుడైన భగవానుడికి నామరూపా లనేవి లేవుగదా. మరి ఆయనా మారాడంటే నామ రూపాత్మకమైన ప్రపంచానికీ ఈశ్వరుడికీ తేడా ఏముంది.
వాస్తవమే. మారగూడదు న్యాయమైతే ఈశ్వరుడు. మారితే వాడీశ్వరుడే గాదు. మరి ఏమిటీ మాట. సాక్షిగా ఉండవలసిన వాడికే కర్తృత్వమెలా చెప్పారు. శ్రద్ధాభక్తులు సడలకుండా చూస్తానంటే కర్తృత్వమే గదా. కర్తృత్వముంటే భోక్తృత్వం కూడా ఉండవలసిందే. అలాంటప్పుడు విశుద్ధ సత్త్వోపాధి ఎలా అయ్యాడీశ్వరుడు. జీవుడిలాగా మలిన సత్త్వోపాధే కావలసి వస్తుంది గదా అని ఆక్షేపణ వస్తే దాని కక్కడ చెప్పిన సమాధానమే ఇక్కడా చెప్పుకోవలసి ఉంది. తామేవ విదధా మ్యహ మని తనకు కర్తృత్వ మున్నట్టు ఈశ్వరు డంటున్నా అది నిజం కాదు. అభినయం. నిజమే అయితే తస్యకర్తా రమపి మాం విద్యకర్తార మవ్యయ మని మాటాడడు. చాతుర్వర్ణ్యాన్ని నేనే సృష్టించానని చెప్పి మరలా నేను సృష్టించనే లేదని దులిపేసు కొన్నాడా లేదా. కాబట్టి కర్తృత్వం పెట్టుకొన్నట్టు నటిస్తాడే గాని వాస్తవంలో కర్త కాడు భోక్త కాడు ఈశ్వరుడు. కేవల సాక్షి భూతుడు.
మరి ఆయన కాకుంటే ఎవడు కర్త. మనబోటి జీవుడు. వీడు మలిన సత్వోపాధి అని గదా పేర్కొన్నాము. అందులో రజస్సు వల్ల వీడు కర్త అయి కర్మ చేస్తాడు. తమస్సు వల్ల భోక్త అయి కర్మఫల మనుభవిస్తాడు. ఆయా దేవతల నారాధిస్తున్నాడంటే కర్త గనుకనే ఆరాధిస్తాడు. వారను
Page 77