#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

బతుకంతా ఉతికి పారేసింది ఉపనిషత్తు. మన కోరికలను బట్టే మన పనులు. మన పనులను బట్టే మనకు కలిగే ఫలితాలు. ఇదీ వరస. ఇదంతా మరలా ఒక స్వప్నం లాగా మిధ్యాభూతమే. పరమార్ధం కాదు. అయినా మానవుడు గ్రహించటం లేదంటే అవిద్యా కామాలే దానికి కారణం.

యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా ర్చితు మిచ్ఛతి
తస్య తస్యా చలాం శ్రద్ధాం - తామేవ విదధా మ్యహమ్ - 21


  అయితే Method in madness అన్నట్టు వెఱిలో కూడా ఒక విశేషముంది. యో యో యాం యాం తనుం ఎవడెలాటి దేవతా రూపాన్ని భక్తః భజిస్తూ శ్రద్ధయా ఎంతో శ్రద్ధా సక్తులతో దాన్ని అర్చితు మిచ్ఛతి - సేవించాలని కోరుతుంటాడో. అంటే ఎవడి కెలాంటి నమ్మకమూ దీక్షా ఉంటుందో ఆ దేవత మీద. తస్య తస్య - అలాటి వాడికి అచలాం శ్రద్ధాం తామేవ విదధా మ్యహం. ఆ దేవత మీదనే అచంచలమైన శ్రద్ధా భక్తు లుండేలాగా నేను చూస్తానని హామీ ఇస్తున్నాడు పరమాత్మ. యే యధా మాం ప్రపద్యంతే అనే శ్లోకానికిది అన్న దమ్ముడిలాగా నడుస్తున్నదీ శ్లోకం. ఎవరెలా నన్నర్ధం చేసుకొంటే వారి కలాగే నేను కనిపిస్తుంటానని గదా అక్కడ చెప్పాడు. అలాగే చెబుతున్నాడిక్కడా. పైకి చూస్తే ఇది చాలా మోసమని తోస్తుంది. ఎలాగంటే భగవంతుడెలా ఉంటాడో అలాగే ఉండాలి గాని ఎప్పుడూ మానవుల బుద్ధుల కనుగుణంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటే వాడేమి భగవంతుడు. ప్రపంచమంటే నామరూపాత్మకం

Page 76

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు