పాపాలు మానవుడికి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమని తరువాత 18వ అధ్యాయంలో రాబోతుంది. అందులోనుంచి బయట పడటమే మోక్షమని సర్వాపాపేభ్యో మోక్షయిష్యామి అనే చరమ శ్లోకం ఇంకా బ్రహ్మాండంగా చాటి చెబుతుంది.
కనుక వాస్తవాన్ని మరచి అవాస్తవాన్ని పట్టుకొని అదే వాస్తవమని
భావిస్తే బంధం కాక మోక్ష మేముంది మానవుడికి జాగ్రత్తును మరచి
స్వప్న ప్రపంచంలో తిరుగుతూ తాను చూచే స్వప్నమే వాస్తవమని
భావించటం లాంటిది. అలా భావించే సరికా స్వప్నంలో చూచిన ప్రతి
పదార్ధమూ ప్రోగు చేసుకొంటే బాగుండునని అభిలాష చూపటం లాంటివి
ఆయా పశుపుత్ర విత్తాదులకు సంబంధించిన వాంఛలు. వాటి కనుగుణంగా
ఆ స్వప్నంలో గుళ్లూ గోపురాలూ అక్కడి దేవతా విగ్రహాలనూ ఆరాధిస్తూ
కూచోటం లాంటివి లోకంలో మనం చేస్తున్న భజనలూ సేవలూ యాత్రలూ
మొక్కుబళ్లూ వ్రతాలూ ఉపాసనలూ ఇలాటి కలాపమంతా. స్వప్నంలోనే
ఉంటూ స్వప్నంలో నుంచి మెళకువ రానంత వరకూ నకలే మన కసలు.
అసలదే నని ఎప్పుడు నమ్మామో ఇక ఆయా నకిలీ దేవతల అనుగ్రహం
సంపాదించాలని మనం పడే పాట్లిన్ని అన్నిగావు. తంతం నియమమాస్థాయ.
ఆయా నియమాలూ నిష్ఠలూ పాటించలేక సతమత మవుతుంటారీ
మానవులు. స యధా కామ స్త త్రతు ర్భవతి - యత్ర తుర్భవతి
తత్ఫలమభి సంధత్తే - యత్ఫల మభిసంధత్తే తత్కర్మ కురుతే - అని వీళ్ల
Page 75