సర్పం దండం ధార అని చూస్తే తాడెలా కనిపిస్తుంది. సర్పధారాదులుగానే కనిపిస్తుంది. అలాగే పరమాత్మ నున్న దున్నట్టు భావించనివాడి దృష్టికి పరమాత్మ ఎలా కనిపిస్తాడు. సర్పధారాదుల లాగా ఆయా దేవతా మూర్తులుగా దర్శన మిస్తాడు. అవి పరమాత్మ కావు. పరమాత్మ తాలూకు ఆభాసలు. పరమాత్మే ఆయా దేవతల రూపంలో భాసిస్తున్నాడు. అఖండ చైతన్య శకలాలవి. పరిపూర్ణమైన చైతన్యం లేదు. అప్పుడవి పరమాత్మకూ అన్యమే. ఈ చూచే సాధకుడికీ అన్యమే. అన్యమయ్యే సరి కనన్యంగా చూడవలసిన పరమాత్మ కాస్తా అన్యంగా భాసిస్తూ ఈ సాధకుడి బుద్ధికంత కంతకు దూర దూరంగా వెళ్లిపోతాడు. అలా అసలైన తత్త్వాన్ని దూరం చేసుకొని దాని నకలు వెంట పరుగెత్తేవాడు నరాధముడు గాక నరోత్తముడెలా అవుతాడో చెప్పండి. అధ యోన్యాం దేవతా ముపాస్తే అన్యోసా వన్యోహ మస్మీతి - న సవేద యధా పశుస్స దేవానాం అని చీవాట్లు పెడుతున్నదు పనిషత్తు. నేనా దేవత కంటే వేరు అది నాకంటే వేరని ఎవడు దాన్ని సేవిస్తూ కూచుంటాడో వాడికేమీ తెలియదు. మూఢుడు వాడు. అంతేగాదు. ఆ దేవతల పాలికి కట్టు బానిస. పశువుతో సమానమని చాటుతున్నది.
అయితే మరి ఎందుకింత మూర్ఖులయి పోతున్నారీ మానవులు. అసలైన భగవత్తత్త్వాన్ని ఎందుకు పట్టుకోలేక పోతున్నారు. వారి బుద్ధుల నింకొక పిశాచి పట్టుకొని కూచున్నది. ఏమిటది. కామై సైసై ర్హృత జ్ఞానాః కోరికలనే పిశాచాలు. అవి వారి బుద్ధుల నటూ ఇటూ తిప్పుతుంటాయి. దానికి కారణం హృత జ్ఞానాః వారి కుండ వలసిన
Page 73