#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము



కామై సై సై ర్హృత జ్ఞానః ప్రపద్యంతే అన్య దేవతాః
తం తం నియమ మాస్థాయ - ప్రకృత్యా నియతాః స్వయా-20


  అయితే సర్వమూ వాసుదేవ స్వరూపమే. ఆత్మ స్వరూపమే అవి తప్ప వస్తు సిద్ధంగా ఎక్కడా ఏదీ లేదని మీరేగదా నిరూపించారు. అలాంటప్పుడెవరు గాని దాన్నే పట్టుకోవాలి గాని దానికి భిన్నంగా ఏదేదో ఉందని భావిస్తూ దాని వెంటబడి పోవలసిన పరిస్థితి ఎందు కేర్పడింది. అది ఎలా సంభవమని ప్రశ్న వచ్చిందిప్పుడు. దానికి సమాధాన మిస్తున్నది గీత. ప్రపద్యంతే న్య దేవతాః నిజమే అన్య దేవతలనే పట్టుకొని పోతున్నారు మానవులు. కారణం. నరాధములు కావటం మూలాన్నే. నరాధములనే మాట లేదు గదా ఇక్కడ. లేకున్నా అలాగే భావించాలి వారందరినీ. ఎంచేత. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః అని గదా చాటాడింతకు ముందు పరమాత్మ. నా అసలైన తత్త్వాన్ని చూడని వాళ్లందరూ నరాధములే నని చాటాడా లేదా. అలాంటప్పు డన్య దేవతల వెంట బడ్డారంటే ఏమని అర్ధం. నరాధములు గాక నరోత్తములా. అక్షరాలా నరాధములే వారు.

  అసలైన భగవ త్స్వరూపం తెలియదు వారికి. తెలియకనే అన్య దేవతల నారాధిస్తున్నారు. తత్త్వానికి భిన్నమైన దంతా దాని కన్యమే. అన్యమైతే వస్తువుగాదు. దాని ఆభాస. వస్తువే దాన్ని ఫలానా అని గుర్తించ పోతే అది దాని కన్యంగా భాసిస్తుంది. తాడును తాడనే చూచేవాడి కది తాడే. పాము గాదు. ధార గాదు. దండం గాదు. కాని అలాకాక దాన్నే

Page 72

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు