స్వరూపంగానే భావించాలట. అక్కడా వాసుదేవ అనే ప్రయోగించా డాయన. ఇదే అర్ధమక్కడా. మొత్తం మీద ఇదం సర్వం యద య మాత్మా అని బృహ దారణ్యకం చాటినట్టు సర్వమూ ఆత్మగా దర్శించటమే అసలైన జ్ఞానం. అది ఏ జన్మ కలవడినా ధన్యుడే మానవుడు. అలవడటమే కావలసింది. అలవడిందో స మహాత్మా సుదుర్లభః - వాడే మహాత్ముడు. ఆత్మ యొక్క మహత్త్వం గుర్తించినవాడు. మహత్త్వం - మహిమ అంటే విస్తారం లేదా విభూతి. స్వరూపం జ్ఞానమైతే జ్ఞేయమైన ప్రపంచమంతా దాని విభూతి Expanse. రెండూ కలుపుకొని ఏకంగా భావించటమే అఖండమైన జ్ఞానం. ఏ ఒకటి వదిలేసినా అది ఖండమే Relative అఖండం Absolute కాదు. మహాత్మా అనే మాట కింత ఉన్నదర్ధం. దీన్నిబట్టి ఎవడినంటే వాడిని పట్టుకొని మహాత్ముడని పేర్కొనటం గాని వాడి కాళ్లమీద బడి వాడి వెంటబడి తిరగటం గాని ఎంత మూర్ఖత్వమో మీ రర్ధం చేసుకోండి. అద్వైతాత్మ దర్శి అయినవాడే నిజమైన మహాత్ముడు. అలాటి దర్శనం లేకుండానే మహాత్ములని భగవానులని చెలామణి అయ్యే బాబాలు గారు - స్వాములవార్లూ సన్న్యాసులూ కారు మహాత్ములు. నిజమైన మహాత్ము డెక్కడో గాని దొరకడు. కొంగలలో హంసలాగా జీవిస్తుంటాడు నిగూఢంగా. కనుకనే దుర్లభుడు కూడా కాదు. సుదుర్ల భు డంటున్నది Very rare గీత. మనుష్యాణాం సహస్రేషు అని ఇంతకు ముందే పేర్కొన్నది గదా. దానికిది ప్రతిధ్వని
Page 71