నీవు పట్టుకోవలసి ఉంటుంది. వస్తు తంత్రమది Actual. బుద్ధి తంత్రం Notional కాదు. వస్తు తంత్రమైన జ్ఞానమెలా ఉంటుందో వర్ణిస్తున్నాడు మహర్షి, వాసుదేవ స్సర్వమితి. సర్వమూ వాసుదేవ స్వరూపమనే జ్ఞానమది. సర్వమంటే జీవ జగదీశ్వరులు మూడూ వ్యాపించినది. అలా వ్యాపించినదే వాసుదేవ. అప్పటికి వసుదేవుని కుమారుడు కృష్ణుడు గాదు వాసుదేవుడు అనేమాట కిక్కడ అర్ధం. వసతి దీవ్యతీతి వాసుదేవః - అస్తి భాతి. సచ్చిత్తులే Existance and consciousness వాసుదేవ అనే మాటకర్థం. అప్పుడే అది నిరాకారమూ వ్యాపకమూ అవుతుంది. కేవలం కృష్ణుడే అయితే అది ఒక పురుష విగ్రహం. నిరాకారమూ కాదది. వ్యాపకమూ కాలేదు. మరి విశ్వరూప మెలా చూపిందది. అప్పుడది వ్యాపకమనే కదా. నిజమే. మాయాశక్తిని వశం చేసుకొని సంకల్ప బలంతో తానే అనేక రూపాలు ధరించవచ్చు. అది ఈశ్వర తత్త్వం. పరమాత్మ తత్త్వం కాదు. పరమాత్మ అయ్యాడో ఇక ఆ కృష్ణుడు కనపడడు. అందుకేగా చివరకు నిర్యాణమయి పోయాడు. కనుక చాలా ఉంది ఆధ్యాత్మిక రహస్య మిందులో. ఆ పాత దృష్టి కంతు పట్టేది కాదు.
కనుకనే క్షేత్ర జ్ఞాధ్యాయ భాష్యంలో ఒకచోట స్వామివారిలా వ్రాస్తున్నారు. యత్పశ్యతి - యచ్ఛృచోతి స్పృశతివా తత్సర్వం వాసుదేవ ఏవేతి ఏవం గ్రహా విష్ట బుద్ధిః ఏది చూస్తున్నా వింటున్నా ముట్టుకొంటున్నా అదంతా ఆయా శబ్ద స్పర్శాదులు కావు. అంతా వాసుదేవ
Page 70