#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

అంతకుముందు చెప్పిన భూమికలు కూడా పట్టుకోక పోతే అపచార మేమోనని వాటికోసం మరలా వెనక్కువచ్చే చాపల్యం పెట్టుకోరాదు. పెట్టుకోకుంటే అస్తికుణ్ణి కాడంటారేమో కర్మభ్రష్టుడని ముద్ర వేస్తారేమో నని భయపడరాదు. ఉద్దరే దాత్మనాత్మాన మన్నారు. లోకం కోసం కాదు మనం బ్రతకవలసింది. మనకోసం. ధర్మార్థ కామాల వరకూ ఒకవేళ సమాజం కోసమని సంకోచం పెట్టుకొన్నా మోక్షపురుషార్ధం విషయంలో ఒకరికొకరికి ఎలాటి సంబంధం లేదు. ఆఖరుకు భార్యాభర్తలకు కూడా లేదు. నాతిచరామి అనేది ధర్మం వరకే. మోక్షానికి వర్తించదు.

  ఏతావతా తేలిన సారాంశమేమంటే జ్ఞానమనేది ఒక జన్మలో కలగనీ - అనేక జన్మలలో కలగనీ. వాడి వాడి అధికార తారతమ్యాన్ని బట్టి ఏర్పడుతుందది. పోనీయండి. ఎలా ఏర్పడితేనేమి. మొత్తం మీద జ్ఞానోదయ మనేది అపురూపమైన వరం మానవుడికి. అది కూడా ఏ జ్ఞానమంటే ఆ జ్ఞానం కాదు. అసలైన సిసలైన ఆత్మజ్ఞానం. నేనూ నాదీ అనే తేడా లేకుండా సర్వమూ నా స్వరూపమే నాకు భిన్నంగా ఏదీ లేదీ సృష్టిలో. జీవుడు లేడు. జగత్తు లేదు. ఈశ్వరుడూ లేడనే అఖండమైన సర్వవ్యాపకమైన జ్ఞానమే జ్ఞానం. మరేదీ గాదు. అదే నిష్కర్ష చేసి చెబుతున్నది గీత. మాం ప్రపద్యతే. పరమాత్మ ఎలా ఉన్నాడో అలా పట్టుకొన్నదే జ్ఞానం. కశ్చిన్మాం వేత్తి తత్త్వతః అని ఇంతకు పూర్వమే వచ్చిందీ విషయం. నీవు పట్టుకొన్నది పరమాత్మ కాదు. పరమాత్మ ఉన్నట్టు

Page 69

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు