ఇప్పుడిలా మరచిపోయి దూరం చేసుకొన్న మన స్వరూపాన్నే మరలా మనం గుర్తు చేసుకోవాలంటే అది అంత సులభంగా అప్రయత్నంగా వచ్చి ఒళ్లో పడుతుందా మీరే చెప్పండి. ఎంతో ప్రయత్నం కావాలి దానికి. ఎంతో కాలం పడుతుంది ఫలించటానికి. ఒక జన్మ కాదు ఎన్ని జన్మలు పట్టినా పట్టవచ్చు. పట్టవచ్చు నని చెప్పటానికీ ఆర్తాది భక్తత్రయమే మనకు నిదర్శనం. ఇంకా వాడార్తుడూ జిజ్ఞాసువూ అర్థార్థీ లెవలు లోనే ఉంటూ జీవయాత్ర సాగిస్తున్నాడంటే ఏమిటర్ధం. జ్ఞానానికింకా ఎదగలేదనే గదా. ఎందుకెదగ లేదు. ఎంతో అంతవరకే వచ్చింది వాడి బుద్ధి. పూర్తిగా ఎదిగి పట్టుకోలేక పోతున్నది తత్త్వాన్ని. దానికి కారణం వారి వారి చిత్త సంస్కారమే. వాసనలే Impressions. ఎక్కడివీ వాసనలని ప్రశ్నే లేదు. అనేక జన్మల నుంచీ పోగైన వని విశ్వసించక తప్పదు. అనేక జన్మ సంసిద్ధః అనేచోట చెప్పామింతకు ముందే. అవేవీ లేవని కొట్టివేస్తే అకృతాభ్యాగమ కృత విప్రణాశాలనే వాటికి జవాబు చెప్ప లేము. చేయనిది రాదు. చేసింది పోదు. కనుకనే వాస్తవంగా కాకపోయినా వ్యావహారికంగా నైనా జన్మాంతరా లొప్పుకోక తప్పదు.
బహూనాం జన్మ నా మంటే అదే అర్ధం. అంతే జ్ఞానవాన్. అన్ని జన్మలూ అయిన తరువాత చివరిసారిగా కలుగుతుందట జ్ఞానమనేది. మరి ఆ జన్మ లెందుకని. కొన్ని వందల జన్మలు సగుణ భక్తి యోగంలో గడచిపోతాయి. అంతకు ముందు కొన్ని సమాధి యోగంలో గడచి ఉంటాయి. అంతకన్నా ముందు కర్మయోగంలో. ఇంకా ముందు
Page 67