ముండా లాయనకు. దాన్ని అమలు పరిచే సామర్థ్యం లేదా అంటే పరిపూర్ణంగానే ఉంది. మరి ఎందుకుగాను ఆయన మనకందరికీ జ్ఞానాన్ని ప్రసాదించగూడదు. తద్వారా మోక్షాన్ని కూడా అందరికీ మూకుమ్మడిగా పంచిపెట్ట గూడదు. అలా జరగటం లేదంటే ఏదో ఉంది కిటుకు. కీలకం. గురుకీలకం.
ఏదో గాదది. బయటపెడితే ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. అసలు నమ్మరేమోనని కూడా నా కనుమానం. అసలు పరమాత్మ అనే భావమేదో ఎక్కడో ఉందని భ్రమపడు తున్నాడు మానవుడు. ఎక్కడా లేదది. ఉన్నది మన ప్రత్యగాత్మే. దాన్ని అందుకొంటే చాలు. అదే సర్వత్ర విస్తరించిన పరమాత్మగా మనకు దర్శన మిస్తుంది. అయితే అందుకోలే దిప్పుడు మనం దాన్ని. మన దగ్గరే ఉన్నా మన స్వరూపమే అయినా దాన్నే మనం కర్తృభోక్తృరూపమైన జీవాత్మగా భావిస్తూ అదేమన స్వరూపమని బోల్తాపడి దానితోనే జీవయాత్ర సాగిస్తున్నాం. అలా జీవాత్మగా మనల నెప్పుడు భావించామో మనకు అతీతంగా పరమాత్మ ఒక డెక్కడో ఉన్నాడు వాణ్ని అందుకోటమెలాగా అని తాపత్రయ పడుతున్నాం. ఆ తపనతో అంతకంతకు మన జ్ఞానాన్ని పెంచుకొంటూ పోయి ఎప్పుడైతే పరిపూర్ణమైన మన ప్రత్యగాత్మే మన అసలైన స్వరూపమనే జ్ఞానం సంపాదించామో అప్పుడంత వరకూ ఎక్కడో ఉన్నాడని ఊహించిన పరమాత్మ ఎవరో గాదు మనమే మన ప్రత్యగాత్మే నని అనుభవానికి వస్తుంది. ఇదీ ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం.
Page 66