అయితే ఆస్థిత స్సహి యుక్తాత్మా. అలాటి సంసిద్ధతా - ఏకాగ్రతా పరిపూర్ణమైన అద్వైత భావనా ఉన్న యుక్తాత్ముడే అలాటి బ్రహ్మాకార వృత్తి అస్థితః గట్టిగా పట్టుకొన్నవాడే జ్ఞానమనే పదవి కర్హుడు. వాడే నిజమైన ఆత్మ జ్ఞాని. వాడికి భగవానుడిక అన్యంగా లేడు. వాడే భగవ త్స్వరూపుడు. సర్వత్ర సర్వదా సర్వ పదార్థాలలో ఉన్నవాడూ వాడే. సర్వమూ తానయిన వాడూ వాడే.
బహూనాం జన్మనా మంతే - జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః - 19
అయితే ఇలాంటి బ్రహ్మాత్మ భావం నీ కలవడాలంటే అది అంత తొందరగా లభించేది గాదు. ఆశతో అఱ్ఱులు చాచినా వెంటనే అందేది గాదు. క్షణశః కణశః అన్నారు పెద్దలు. ఒకవేళ అప్పుడే నా కబ్బిందని నీలో నీవు సంతోషించినా అది నకిలీ బాపతే. ఎప్పటికీ నిలవదది. హర్ చె జూద్ బరాయద్ - దేర్ నపాయద్ - ఏది అప్రయత్నంగా వచ్చి ఒళ్లో పడుతుందో అప్రయత్నంగానే అది ఒళ్లో నుంచి జారిపోతుం దంటాడొక సూఫీ. కాబట్టి మానవ ప్రయత్నం లేకుండా హఠాత్తుగా ఏదీ రాదు. అలా వచ్చేట్టే అయితే ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు గదా. ఉండటంలో కూడా ఎక్కడ బడితే అక్కడ ఎవరి మనస్సులో నంటే వారి మనసులో సిద్ధంగా ఉన్నాడు గదా. ఆయనకు వారసులమే గదా మనమంతా. ఆ మాటతానే చెప్పాడు కూడా. అలాంటప్పుడు మనమీద ఎంతో అనుగ్రహ
Page 65