#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

అని దానికోసం అన్వేషిస్తుంటాడు. అంతేగాని అది ఎక్కడో లేదు. ఏదో గాదు. అంతటా ఉందది. అది కూడా నాకు అన్యం కాదు. నా స్వరూపమే జ్ఞేయం కాదు. జ్ఞానమే ననే జ్ఞానం లేదు వాడికి. అది ఉంటే వాడు జ్ఞానే. వాడికిక పరమాత్మ వేరుగాదు. తానాయనకు వేరు అంతకన్నా కాదు. 'అహమేవ భగవాన్ వాసుదేవః న అన్మోస్మి' సచ్చిద్రూపుడైన ఆ పరమాత్మ నేనే నాకు అన్యంగా లేడని భాష్యకారులు కూడా సమర్ధిస్తున్నారు.

  ఇంతకూ ఎవరికీ గాక ఒక్క జ్ఞానికే ఎందుకిలా పట్టాభిషేకం చేస్తున్నాడు భగవానుడని అడిగితే సమాధాన మిస్తున్నది గీత. ఆస్థిత స్సహి ధర్మాత్మా మామేవా నుత్తమాం గతం. నేనే తానూ తానే నేననే అనన్య భావన వదలకుండా దానినే తనకు ధర్మంగా స్వభావంగా పెట్టుకొని నన్నే అన్నిటికన్నా ఉత్తమమైన జీవిత గమ్యంగా భావించిన వాడు జ్ఞాని. వాడు కాకపోతే మరెవ రవుతారు నా స్వరూపం అని భగవానుడి సమాధానం. మిగతా వారెంత భక్తులైనా దూరదూరంగానే చూస్తారు భగవత్తత్త్వాన్ని. ఎంత దగ్గరగా వచ్చినా తమ కన్యమే అది. వాడు రామదాసే కావచ్చు. తుకారామే కావచ్చు. మీరాబాయే కావచ్చు. ఎవరైనా ఎంత భక్తులైనా సగుణ భక్తులే. నామరూపాత్మకంగానే భజిస్తారు పరమాత్మను. కారణం. తాము నామరూపాత్ములు. తమ దృష్టి నామరూపాత్మకం. కాదండీ. అవి కూడా దాటిపోయారా మహాభక్తు లంటావా. అయితే రాముడన గూడదు. కృష్ణుడన గూడదు. దుర్గా - కాళీ లలితా అనే మాట రాగూడదు నోట.

Page 63

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు