#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

సుదుర్లభః అని తరువాత చెప్పబోతున్నాడు గీతాచార్యుడు. అసలైన భగవత్తత్త్వాన్ని ఉన్నదున్నట్టు గుర్తించిన వాడికంటే దాన్ని తన స్వరూపంగా దర్శించిన వాడికంటే మహనీయు డెవడున్నాడు. కనుక వాడే విశిష్టుడు.

  అయితే మిగతా ముగ్గురూ కూడా భజంతే మాం - నన్ను భజించే భక్తులేనని చాటాడు గదా భగవానుడే స్వయంగా. అలాంటప్పుడేదో ఒక విశేషం వారిలో కూడా లేకుంటే ఎలా చాట గలడా మాట అని ప్రశ్న వస్తుంది. దానికి జవాబిస్తున్నా డాయన. ఏమని. నిత్యయుక్తః - ఏకభక్తి అంటున్నది గీత. భక్తి. ఇదీ జవాబు. జ్ఞానమనేది ఒకటి అబ్బితే చాలు. మిగతా మూడూ స్వతంత్రంగా ఎక్కడా ఉండలేవు. అందులోనే కలిసి వస్తాయి. ఇలా కలిపి భజించటం - పట్టుకోటం. నిర్గుణమైన ఆత్మతత్త్వాన్ని భజిస్తూనే జ్ఞాని సగుణమైన అనాత్మ జగత్తును కూడా తదాకారంగానే భావిస్తాడు కాబట్టి రెండూ కలిపి ఏకంగా పట్టుకొనే ఏకభక్తి వాడు. అప్పటికేమని తాత్పర్యం. కేవలం కర్మధ్యాన భక్తియోగాల వరకే అయితే దేనిపాటికది పేలపిండిలాగా విరిసిపోయేవేగాని అన్నీ కలిసి ఏకంగా మారవు. మారకుంటే ఏకైకమైన తత్త్వాన్ని పూర్తిగా పట్టుకోలేవు. అవే జ్ఞానంలో పర్యవసానం చెందితే జ్ఞానాకారంగా మారి ఏకంగా ప్రసరించే ఆజ్ఞానం ఏకైకమైన పరమాత్మను పట్టుకోటమే గాక అలాటి జ్ఞాని జీవితంలో జ్ఞానంతోపాటు మిగతా మూడూ కూడా మనకు తార్కాణ మవుతుంటాయి. అందుకే కర్మయోగాదులలో ఎందులోనూ లేని విశిష్టత జ్ఞానంలోనే ఉందని వర్ణించటం గీత.

Page 59

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు