మెరుగు. కాగా ఇప్పుడంత కన్నా మెరుగనిపించాలి మూడోవాడు. వాణ్ణి ధనకాముడని వర్ణిస్తే ఎలాగ. మరేమిటి అర్థార్థి అంటే. అర్థమంటే ధనమనే కాదు. పరమార్ధం. దాన్ని అర్థించేవా డర్దార్థి. జిజ్ఞాసువుకూ వీడికీ తేడా ఉంది. భగవత్తత్వ మేమిటో ఇదమితమని తెలియదు జిజ్ఞాసువుకు. అందులో అసలైన తత్త్వమేదో అదే పట్టుకోవాలని ఆరాటపడే వాడు అర్ధార్ధి. వాడు సర్వసామాన్యంగా చూచి భగవంతుడంటే వీడు ఏదంటే అది గాక అసలైన తత్త్వమేదో దాన్నే చూడాలని కోరేవాడు. పోతే ఇక ఆఖరివాడు జ్ఞానీచ అన్నది గీత. జ్ఞాని నాలుగోవాడీ వరసలో. భగవంతుడంటే ఎవడో తెలుసుకొందా మనీ గాదు. అసలైన స్వరూపమేదో దాన్నే తెలుసుకొందా మనీ గాదు. అసలైన ఆ తత్త్వం తన స్వరూపంగా దర్శించేవాడు జ్ఞాని. పరోక్ష జ్ఞానమే గాక అపరోక్షానుభవం కూడా ఉన్నవాడు. సుకృతులు నలుగురిలో చివరి భూమిక నందుకొన్నవాడు జ్ఞాని. ఇక వీణ్ణి మించి సాధకుడూ లేడు. సిద్ధుడూ లేడు. సాధకుడైనా వీడే సిద్ధుడైనా వీడే. భగవంతుడిలాగా అన్ని విధాలా పరిపూర్ణుడు వీడు. అదే వివరిస్తున్న దిప్పుడు గీత.
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః - ఏకభక్తి ర్విశిష్యతే
ప్రియోహి జ్ఞానినో - 2 త్యర్థ మహం సచ మమ ప్రియః -17
తేషాం జ్ఞానీ విశిష్యతే వారి నలుగురిలో జ్ఞాని అయినవాడు విశిష్టుడు. మిగతా వారందరి కన్నా చాలా గొప్పవాడు. స మహాత్మా
Page 58