భజిస్తాడు. ఒక డర్ధార్థి అయి ఆశ్రయిస్తాడు. ఇంకొకడు జ్ఞాని అయి గుర్తిస్తాడు. ఆర్తుడంటే ఆపద ఏదో ముంచుకొస్తే నన్ను స్మరించే వాడు. తస్కర వ్యాఘ్ర రోగాదిన అభిభూతః అని వ్రాస్తున్నారు భాష్యకారులు. ఎవరో దొంగలు తరుముకు రావచ్చు. అడవి మార్గంలో వెళ్లుతుంటే క్రూరమృగ మొకటి ఎదురు కావచ్చు. మరి తీవ్రమైన వ్యాధులు శరీరాన్ని కుంగదీయవచ్చు. అప్పుడు కనపడతాడు వాడికి భగవంతుడు. అంతవరకూ నా అంతవాడు లేడని మీసం దువ్వుతుంటాడు. అప్పటికప్పుడు దేవుణ్ణి పట్టుకొని పబ్బం గడుపుకొని బయటపడా లనుకొనే వాడార్హుడు. పోతే జిజ్ఞాసుః - భగవత్తత్త్వ మేమిటా అని దాన్ని అవగాహన చేసుకోవాలనే తాపత్రయ మున్న వాడు జిజ్ఞాసువు. జ్ఞాతు మిచ్చుః జిజ్ఞాసుః తెలుసుకోవాలనే ఉత్కంఠ ఉన్నవాడు. వీడికొక ఆపద వచ్చి నెత్తిపడ్డప్పుడే గాదు. పడ్డా పడకపోయినా అసలు తత్త్వమేమిటో తెలుసుకోవాలని తపన. ఆర్తుడి కంటే వీడు కొంత మెఱుగు.
పోతే అర్ధారీ. అర్థార్థి అంటే ధనకామః అని అర్ధం వ్రాస్తారు స్వామివారు. కాని నాకంత సమంజస మనిపించలేదా అర్ధం. ఎందుకంటే ఒక వరసలో చెబుతూ పోతున్నది గీత. ఆర్తుడి దగ్గరినుంచీ జ్ఞాని వరకూ అంతకంత కారోహణ క్రమంలో నడుస్తున్నది వర్ణన. అందులో మొదట ఆర్తుడన్నది - వీడందరి కన్నా తగ్గు రకం. తరువాత జిజ్ఞాసు వన్నది. వీడు భగవత్తత్త్వ మేమిటో తెలుసుకోవాలను కొన్నవాడు. వాడికంటే
Page 57