#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

విమర్శ. అదే ప్రయత్నం. ఒక పక్క అసుర గుణాలు నిన్ను అటూ ఇటూ లాగేస్తున్నా దైవగుణమైన సత్త్వం కూడా నీలో ఉంది కాబట్టి దాన్ని పైకి తెచ్చుకొని రజస్తమో ధాటిని తిప్పికొట్టే సామర్థ్య మలవరుచుకో వచ్చు నీవు. అలా కాకపోతే ఎప్పటికీ ఏ జన్మకూ మోక్షం లేదు మానవుడికి. లేదని చెప్పటానికే అయితే ఉపనిషత్తుల దగ్గరి నుంచీ భగవద్గీత వరకూ అన్నీ మన కనవసరమే. నిష్ప్రయోజనమే. కాబట్టి నాతి శంక నీయో యమర్ధః

  గీత ఏమి చెబుతున్నదీ విందా మిప్పుడు. జనా స్సుకృతి నోర్జున సుకృతులైన మానవులున్నారు. లేకపోలేదు లోకంలో. అందరూ దుర్మార్గులూ కారు. అందరూ సన్మార్గులూ కారు. 90 మంది దుర్మార్గులైనా ఒక పదిమందైనా సత్పురుషు లుండక పోరు. దానికి గుర్తు వారిలో సత్త్వగుణం కొంతకు కొంతచోటు చేసుకోటమే. ఎంతెంత సత్త్వం పెరుగుతూ పోతే అంతంత తగ్గు ముఖం పడతాయి రజస్తమస్సులు. దానితో ఆవరణ దోషం చీకటిలాగా క్రమక్రమంగా విరిసిపోయి ఆత్మ దర్శనం కావటాని కవకాశ మేర్పడుతుంది.

  అయితే సుకృతులని కితాబిచ్చామే. వీరు కూడా అందరూ ఒకే తరగతికి చెందినవారు కారు. తరతమ భేదముంది వీరిలో కూడా. నాలుగు జాతు లున్నాయి వీరిలో. చతుర్విధా భజంతే మాం. నలుగురూ నన్ను పట్టుకొనే వారే. కాని ఆ పట్టుకోటంలో తేడా ఉంది. ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ద్ జ్ఞానీచ. ఒకడందులో ఆర్తుడయి పట్టుకొంటాడు. ఒకడు జిజ్ఞాసువై

Page 56

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు