#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

త్రిగుణాత్మిక ఆ మాయ. రజస్తమస్సులే గాక అందులో సత్త్వమనే మరొక గుణం కూడా ఉందనే మాట మనం మరచిపో గూడదు. అది మరచిపోయి కేవలం రజస్తమస్సులనే పట్టుకొని దానికి బానిస అయి అలాగే బ్రతుకు సాగిస్తే వాడు మూఢుడు. నరాధముడూ. దుష్కృతి. అలాకాక సత్త్వగుణ మొకటి ఉందని గుర్తించి దాని నలవరుచుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తే వాడు దుష్కృతి కాడు. సుకృతి. అయినా మన కనుమానమే. అదేమిటంటే మాయా శక్తి ఎంత శక్తి అయినా అది అచేతనం కదా. ఒకరికి సత్త్వం మరొకరికి రజస్తమస్సులు పంచి పెట్టాలనే విచక్షణ దానికే ముంటుంది. లేకుంటే అందరూ ఒకేవిధంగా దుష్కృతులైనా కావాలి. సుకృతులైనా కావాలి గదా. ఈ తేడా సృష్టిలో ఎలా వచ్చింది.

  నిజమే రాగూడదు. ఇది ప్రారబ్ధమా ప్రయత్నమా ఏది ముందు ఏది తరువాత అనే ప్రశ్నలాంటిది. జీవుడు భోక్తే గాక కర్త కూడా అనే సత్యం మీరు మరచి పోతున్నారు. మాయా శక్తి ప్రారబ్ధ రూపంగా అందరినీ పట్టి చూస్తుంటుంది. అదే అసుర భావాలు నీ మనసుకు కల్పించి దుష్కర్మలు చేయమని నిన్ను పురికొల్పు తుంటుంది. కాని అది తప్పు గదా అలా చేయటమనే విమర్శ ఒకటి మరలా ప్రయత్నరూపంగా నీ మనసు కేర్పడుతుంటుంది. ఇందులో మొదటి దానికి తలవంచే స్వభావం నీకెంత ఉందో దాన్ని కాదని త్రోసి పుచ్చి మంచి మార్గంలో నడుచుకొనే స్వభావం కూడా నీకు లేకపోలేదు. ఎందుకంటే నీవు భోక్తవే గాక కర్తవు కూడా. కర్తవు గనుకనే దానివలలో పడ్డా తప్పించుకొని బయటపడగలవు. అదే

Page 55

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు