నోచుకొనేవాడు. దాని మొగమే చూడటానికి బుద్ధి పుట్టకపోతే ఏమి చేయగలడు. ఇక వాడు చేయగలిగిన వన్నీ దుష్కార్యాలే. అది కూడా స్వార్ధం కోసమే. తనకు మేలు జరిగితే చాలు. ఇతరులకెంత ద్రోహం చేయటానికైనా పాలు పడతాడు. దానితో రాగద్వేషాలు పెరిగిపోతాయి. ప్రపంచమంతా తదాకారంగానే కనిపిస్తుంటుంది వాడి బుద్ధికి. ఇక ఆత్మేమిటి. దాని ఆలోచన ఏమిటి. అసలు దానికీ వాడికీ ఎంత దూరమో చెప్పలేము.
అయితే ఒక సందేహ మిక్కడ. ప్రతి మానవుడికీ ఆత్మ తత్త్వాన్ని ఆకళించుకొనే జ్ఞానం సహజంగానే ఉందని గదా చెప్పారు భాష్యకారులు. భగవానుడు కూడా గీతలో అలాగే గదా బోధిస్తున్నాడు మమైవాంశో జీవలోకే జీవభూతః అని. అలాంటప్పు డున్నట్టుండి వాడీ మాయా ప్రభావాని కెలా లోనయ్యాడు. మాయకంత ప్రభావముంటే ప్రతి ఒక్కడినీ లోబరుచు కోవచ్చు గదా. లోబరుచుకొంటే మానవులందరూ దుష్కృతులే కావాలి గదా. అందరూ దుష్కృతులైతే ఇక ఆత్మజ్ఞాన మెవడూ సాధించలేడు. తరించలేడు. అలాంటప్పుడిక ఈ శాస్త్రోపదేశ మెవరికి. ఎందుకు. ఇదీ ప్రశ్న. దీనికి సమాధాన మిప్పుడు వస్తున్నది. వినండి.
చతుర్విధా భజంతే మాం - జనా స్సుకృతి నోర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్ధారీ - జ్ఞానీ చ భరతర్షభ - 16
మానవులందరూ దుష్కృతులు కారు. దుర్మార్గులు కారు. కారంటే వారి మీద మాయా శక్తి పనిచేయదని గాదు. చేస్తుంది. కాని అది
Page 54