#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

  దాని కేమిటి కారణం. అపహృత జ్ఞానా అంటున్నది గీత. వాడి జ్ఞానాన్ని అపహరించింది. ప్రక్కకు లాగేసింది. కనుకనే జ్ఞానమున్నా అది ఆత్మను గుర్తించేటంత గొప్ప జ్ఞానం కాకుండా పోయింది. ప్రక్కకు లాగేసింది ఏది. ఇంకెవ రున్నారు. మాయయా. మాయాశక్తి. మాయ అంతా చెడ్డది కాదు. అందులో సత్త్వగుణం మంచిదే. అది విభీషణుడు. రజస్తమో గుణాలున్నాయే మిగతా రెండూ. అవి రావణ కుంభకర్ణుల లాంటివి. ఆవరణ విక్షేప శక్తులవి మాయకు. ఒకటి ఆత్మ చైతన్యాన్ని ఆవరిస్తే మరొకటి అనాత్మ ప్రపంచం మీదికి త్రోసేస్తుంది మానవుడి బుద్ధిని. దానితో అంతో ఇంతో సత్త్వగుణమున్నా అది గుడ్డిదీపంలాగా ఉండీ ఉపయోగం లేని దయింది. అంతేకాదు. రజస్తమో గుణా లున్నాయే అవి దైవ సంపద గాదు. అసుర సంపద. నిబంధాయాసురీ మతా అని తరువాత చెప్పబోతుంది గీత దైవాసుర విభాగయోగంలో. రజస్సూ తమస్సూ రెండూ నిన్ను సంసారంలో కట్టి పడేసేవే. పడదోసేవే. ఆసురం భావ మాశ్రితాః అలాంటి ఆసురమైన సంపదనే గొప్ప సంపద అని పోగు చేసుకొన్నాడీ మానవుడు. నూటికి తొంభయి మంది అలాటి అసురభావ పరివేష్టితులే. భావమెప్పుడు ఆ సురంగా మారిందో యద్భావ స్తద్భవతి. భావాను గుణంగానే నడుచుకొంటాడు గాని దానికి భిన్నంగా నడుచుకోలేడు. కనుకనే దుష్కృతినః అని చెబుతున్నది గీత. దుష్కార్యాలే చేస్తూ పోతాడు జీవితాంతమూ. అంటే సన్మార్గంలో ప్రవర్తించే బుద్ధి పుట్టదు. పుడితే కర్మయోగ సమాధి యోగ భక్తి యోగాల ద్వారా ఎప్పటికైనా ఆత్మ జ్ఞానానికి

Page 53

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు