దోషం తనలో కాదు మనలోనే ఉందట. అందుకే నరులు కారు. నరులలో అధములు వారు. నరులందరూ అధములు కారు. అందులో ఉత్తము లుండవచ్చు. మధ్యములూ ఉండవచ్చు. వారిని నేను తప్పు పట్టటం లేదు. ఎవరు అధములో వారినే. ఎందుకయ్యా రధములు వారు. అసలైన భగవత్తత్త్వమేదో తెలుసుకొనే జ్ఞానం లేదు వారికి. ఎందుకు లేదా జ్ఞానం. సహజంగా ప్రతి మానవుడికీ ఉందది. లేకపోలేదు. స్వభావేన సర్వప్రాణినాం జ్ఞానం ఆత్మావ బోధన సమర్ధమపి అని చాటి చెప్పారు ముండక భాష్యంలో భగవత్పాదులు. ప్రతి మానవుడికీ జ్ఞానం సహజంగానే ఉంది. అది ఆత్మ స్వరూపాన్ని పట్టుకోటానికి సమర్ధమైనదే నట. అలా పట్టుకొనే సామర్ధ్యముంది గనుక నరోత్తముడే వాడు. కాని ఒక ప్రమాదం జరిగింది. అదేమిటో చెబుతున్నా డాయన. బాహ్య విషయ రాగాది దోష కలుషిత మప్రసన్న మశుద్ధం సత్. బాహ్యమైన విషయాల తాలూకు రాగద్వేషాది దోషాల వల్ల కలుషితమై శుద్ధిని కోలుపోయింది. కోలుపోయే సరికి నావ బోధయతి నిత్య సన్నిహిత మ ప్యాత్మ తత్త్వం. నిత్యమూ తనకు దగ్గరగా ఉన్నా తన స్వరూపమే అయినా ఆత్మచైతన్యాన్ని పట్టుకోలేక పోతున్న దంటారాయన. చూచారా. ఎంత ప్రమాదం జరిగిందో. అంచేతనే నరోత్తముడు కావలసిన వాడు నరాధముడయి కూచున్నాడు. ఉత్తముడ ధముడెందు కయ్యాడు. మూఢాః - మూఢు డయినందు వల్ల. మోహమున్న వాడెవడో వాడు మూఢుడు. మోహమంటే అజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకపోవటం.
Page 52