ఎంత సేపటికీ విశ్వ భావనే గాని విశ్వేశ్వర భావన లేదు వీడికి. విశ్వమనేది విశ్శేశ్వరుడి విలాసమే దీని ద్వారా దాన్ని పట్టుకోటానికే ఉందిది. పట్టుకొని ఆ దృష్టితో చూస్తే ఇది కూడా విశ్మేశ్వరుడే ననే అద్వైతాను భవం కలుగుతుందనే గొప్ప సూక్ష్మం వీడికి స్ఫురించటం కష్టంగా ఉంది. అంచేత ఆయన గాక ఆయన రూపమేదో ఉంది. అది ఈ చూచేది కాదు. మరొక అద్భుతమైన విశ్వరూప మొకటుంది ఆయన దగ్గర గుప్తంగా. అది చూస్తే బాగుండునని వీడికి చాపల్యం. పోనీలే అది చూపితేనైనా అర్థం చేసుకొంటాడేమో తత్త్వాన్నని తన యోగమాయా ప్రభావంతో ఒక అద్భుతమైన విశ్వాన్నే ప్రదర్శించాడాయన. దానికి కావలసిన దృష్టి కూడా ప్రసాదించాడు. అయినా చూడలేడు. భయపడి పోతాడని తెలుసు ఆయనకు. కారణం అధిష్ఠానాన్ని గుర్తించకుండా ఆరోపిత మెంత చూచినా సుఖం లేదు. అది దానికి భిన్నంగానే కనిపించి భయభ్రాంతుణ్ణి చేస్తుంది మానవుణ్ణి. భయం లేకుండా చూడాలంటే ఒకరు చూపటమూ కాదు. ఒకరు తనకు దృష్టి ఇవ్వటమూ కాదు. మనమే తెచ్చుకోవాలా దృష్టి. మనమే చూడాలా దృష్టితో ఈ విశ్వాన్ని. అప్పుడది విశ్వం కాదు. విశ్శేశ్వరుడే నని అర్థమవుతుంది. అలా అర్థం చేసుకోవాలంటే భక్త్యాత్వనన్యయా. అనన్యమైన భక్తి ఒక్కటే ఉపాయం మరేదీగాదని ముగించాడు పదకొండవదైన విశ్వరూపాధ్యాయం మహర్షి