#


Index


ఉపసంహారము

  పోతే చివర అనన్య భక్తి అన్నారే అదేమిటని అడిగితే భక్తి యోగమనే పన్నెండవ అధ్యాయం దాన్ని చక్కగా నిరూపిస్తుంది. మొదట అన్య భక్తి ఎలాంటిదో చెప్పి తరువాత అనన్య భక్తిని ప్రతిపాదించింది. అన్యంలో ఇంకా గుణసంపర్కం కొంచెమైనా అంటుకొని ఉంటుంది. అది కూడా మనసుకు రాకుండా గుణాన్ని కూడా ప్రవిలాపనం చేసి నిర్గుణంగా తన కనన్యంగా పరమాత్మను దర్శించినప్పుడే జీవుడు తాను ప్రత్యగాత్మ అయి ఈశ్వరుణ్ణి తన కభిన్నమైన పరమాత్మ స్వరూపంగా స్వానుభవానికి తెచ్చుకోగలడని జ్ఞాని లక్షణాలను వర్ణిస్తూ ఈ భక్తి యోగమనే అధ్యాయం ముగిసిపోతుంది. ఆ మాటకు వస్తే మొదటి అయిదూ పరమాత్మ స్వరూపాన్ని వర్ణించేవైతే ఈ ఆరవ అధ్యాయం ఆ తత్త్వాన్ని చేరే సాధన మార్గమను కోవచ్చు. భగవ త్స్వరూపమది. సాధన ఇది. జీవేశ్వర స్వరూపాలు రెండూ శుద్ధి అయితేగాని సాధన కాస్కారం లేదు. నామరూపాది గుణ సంపర్క మున్నంత వరకూ జీవుడూ శుద్ధి కాడు. ఈశ్వరుడూ శుద్ధి కాడు. శుద్ధి అయిన ఈశ్వరుడు బ్రహ్మమే. శుద్ధి అయిన విశ్వమాయన విభూతే. స్వరూప విభూతులు రెండూ కలిసి ఏకమయినప్పుడే అది సమగ్రమైన బ్రహ్మ తత్త్వం. అది ఆత్మ స్వరూపంగా దర్శించే జీవుడూ బ్రహ్మ స్వరూపుడే. ఇది అంచెల వారిగా బోధిస్తున్నదీ ద్వితీయ షట్కం మనకు. ఇదీ దీని సారాంశం.









బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు