ఇలా కలగా పులగం చేసి అడ్డదిడ్డంగా వర్ణించటం వ్యాస మహర్షి ఒక స్వప్నం లాంటిదీ సృష్టి. స్వప్నంలో ఏది ముందో ఏది వెనకో నిర్ణయించలేము. ఏది ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో సబుబూ చట్టు బండలూ ఉండదు. అంతలో దొంగలు తరుముకు వస్తారు. అంతలో ఒక పెండ్లి కందరమూ కలుసుకొంటాము. అంతలో ఒక రైలు బండిలో ఎక్కి పోతుంటాము. వెంటనే ఆకాశంలో పక్షిలాగా ఎగిరి పోతాము. ఒక వరసా వావీ ఉండదు. ఉంటుందని ఆసించలేము. వాస్తవమైతే గదా ఒక పద్ధతి ఒక సబబు. అంతా ఆభాసే ఆయె. అదే జగత్తులో అయితే అలా నిమిష నిమిషానికీ వస్తు వాహనాదులు గాని మనం గాని మారిపోము. ఇదుగో ఇలా ఎక్కడికక్కడ చిత్ర విచిత్రంగా మార్చి పారేస్తూ వర్ణిస్తున్నాడంటే ఇది వాస్తవం కాదు రా బాబూ వాస్తవం పరమాత్మే ఆతత్త్వం మీద నీ దృష్టి పడటానికిది కేవల మొక సంకేతమే. అనేకత్వ మేకైకమైన తత్త్వానికి మార్గదర్శకమే నని గ్రహించండి మీరని మనకు మహర్షి మౌనంగా చేస్తున్న ప్రబోధమిది. దానికిది ఇలా విడ్డూరంగా అడ్డదిడ్డంగా వర్ణిస్తే గాని ఆలంబనంగా తోడ్పడదు. అసతో మాస ద్గమయ అన్నట్టు అసద్రూపమైన ఈ సృష్టే సత్యాన్ని మనకు చూపుతుంది. అక్రమమే సక్రమమైన తత్త్వాన్ని మనకు బోధిస్తుంది. హర్ జి దీరా బెజిద్దే ఆన్ బిదాన్ అన్నారు సూఫీ విద్వాంసులు. సత్యాన్నెప్పుడూ దానికి వ్యతిరిక్తమైన అసత్యం ద్వారానే పట్టుకోవాలి. వైషమ్యమే సామ్యాన్ని చూపటానికి తోడ్పడుతుందని మనకు
Page 351