అర్జునుడు గుర్తు రావటమేమిటి. ఇలా జడ చేతనాలనూ స్థావర జంగమాలనూ మూర్తా మూర్తాలనూ కలగా పులగం చేసి ఏకరువు పెట్టటమేమిటి. ఏమి సమంజస మనిపిస్తుంది. ఇది మూడవ సందేహం.
దీనిలో చాలా అంతరార్ధముంది. విభూతి అనేది పరమాత్మ సృష్టి. సృష్టి అనేది వాస్తవం కాదు. వాస్తవంగా జరగలేదది. ఉన్నది ఏకైకమైన బ్రహ్మ చైతన్యమే. అదే నానా విధమైన ప్రపంచంగా భాసిస్తున్నది. వివర్తమే గాని ఇది ఆరంభం కాదు - పరిణామం కాదని అద్వైతుల సిద్ధాంతం. నిమిత్తో పాదానాలు రెండూ ఒకటే అయినప్పుడదే కార్యరూపంగా భాసిస్తున్న దని చెప్పాలే గాని అందులో నుంచి ఏదో క్రొత్తగా వచ్చిందని లేక అదే ఈ రూపంగా మారిపోయిందని వాదించటమేమి బాగు. ఆరంభ పరిణామాలు కాదిది వివర్తమే నని సూచించటానికే ప్రతి విభూతిని వర్ణిస్తున్నప్పుడూ అహ మస్మి అనే పదే పదే ప్రయోగిస్తుంటాడు. అంటే ఏది విభూతిగా చూస్తున్నావో అది నేనే నా నుంచి వచ్చింది కాదిది. నేను మారింది కాదు. నేనే అలా మీకు ఆయా రూపాలలో భాసిస్తున్నానని ధ్వనింప జేయటానికే ప్రతిచోటా అహమని అస్మి అనే ఈ ప్రయోగం. సామానాధి కరణ్యమంటారు దీన్ని శాస్త్రంలో. అంటే నేనేనా విభూతి - నావిభూతి మరలా నేనే - తేడా లేదని చూడమని మనందరికీ చేస్తున్న ప్రబోధమిది. కాబట్టి కేవల మదే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నదనే చెప్పాలి. వాస్తవం కాదు - కేవలమిది ఆభాస అని మన బుద్ధి కారూఢం చేయటం కోసమే
Page 350