శౌర్యాది గుణాలూ ఆయా లోకాలలో మనకు గోచరించే స్థావర జంగమాత్మక సృష్టి అంటే పశు పక్షి మృగాదులైన చేతన సృష్టి - వననదీ పర్వత పట్టణాది అచేతన సృష్టి అంతా స్పృశించి నట్టయింది. అంతేగాక మూర్తమైన రూపాలూ అమూర్తమైన భావాలూ కూడా పేర్కొన్నట్టయింది. సంగ్రహంగా చెప్పినా సృష్టినంతా పరామర్శించాడు తన వర్ణనలో మహర్షి అయితే ఆ వర్ణించటంలో ఒక విడ్డూరమైన సంగతేమంటే ఒక వరసలో చేయలేదా వర్ణన. ఆదిత్యాది దేవతలను చెబుతూ వెంటనే వేదాలంటాడు. ఇంద్రియాలంటాడు. రుద్రులూ యక్షరాక్షసులను చెబుతూ మేరుపర్వత మంటాడు. తరువాత బృహస్పతీ కుమారస్వామీ అంటూ వెంటనే సరస్సులూ సముద్ర మంటాడు. మహర్షులను ప్రస్తావిస్తూ అక్షరమూ అకారమూ హిమాలయ పర్వతమని పేర్కొంటాడు. అశ్వత్థ వృక్షమని చెబుతూ నారదుడు చిత్రరధుడు కపిలుడంటాడు. ఉచ్చైః శ్రవమూ ఐరావతమని చెబుతూ ఆయుధాలూ కామధేనువు కామదేవుడూ వెంటనే వాసుకి అనే సర్పమూ ఎందుకు వచ్చారో తెలియదు. ప్రహ్లాదుడూ కాలమూ సింహమూ గరుత్మంతుడూ పవనుడూ శ్రీరాముడూ మకరమూ గంగా వీటినిలా పరిగణించటంలో ఏమైనా అర్థముందా. సృష్టి స్థితి లయాలు చెబుతూ అధ్యాత్మ విద్యను పేర్కొనట మేమిటి. మృత్యువేమిటి. కీర్తి స్మృతి మేధా ధృతులేమిటి. గాయత్రి ఏమిటి. మార్గ శీర్ష మాసమేమిటి. వసంత ఋతువేమిటి. వెంటనే జూదమేమిటి. తేజస్సేమిటి. జయమేమిటి. వ్యవసాయమేమిటి. ఆ వెంటనే యాదవులలో కృష్ణుడూ పాండవులలో
Page 349