పడతామేమో నని - అసలు నా విభూతి ఇంతే కాదు. అది అనంతమైనది. కేవల ముదాహరణకు కొన్ని మాత్రమే ఏకరువు పెట్టాను నీకోసమని కూడా చివర ముగింపు మాటల్లో తేటపరిచాడు. అంచేత ఏమిటిన్నే చెప్పాడింతేనా భగవద్విభూతి అని శంకించరాదు.
పోతే రెండవది. ప్రధానమైనవి మాత్రమే ఉదాహరించినా అవి అండపిండ బ్రహ్మాండాత్మకమైన సృష్టినంతా గాలించినట్టే వర్ణించాడు. వ్యాస మహర్షి. ఆదిత్యానా మనే శ్లోకం దగ్గరి నుంచి జాగ్రత్తగా చూస్తూ పోతే తెలుస్తుంది మనకీ విషయం. సూర్యచంద్ర నక్షత్రాదులను ముందు పేర్కొన్నాడు. తరువాత ఋగాదికమైన వేద వాఙ్మయం - దేవ లోకాలలో దేవతలు దేవేంద్రుడూ మానవ లోకంలో మానవులూ వారి ఇంద్రియాలూ మనస్సూ వారి చేతన అంటే బుద్ధి వృత్తులూ అన్నీ ఏకరువు పెట్టాడు. తరువాత వసు రుద్రాదిత్య మరుద్గణాలను యక్షరాక్షసులనూ పేర్కొన్నాడు. బృహస్పతి కుమారస్వామి మహర్షులూ యజ్ఞాలూ యాగాది కర్మలూ చెప్పాడు. తరువాత పర్వతాలూ నదులూ - వృక్షాలూ అశ్వాలూ గజాలూ - నరులూ గంధర్వులూ - నరుల ఆయుధాలూ సర్పనాగ జాతులూ దైత్య మృగ పక్షి జాతులూ - దేశ కాలాలూ విద్యా మంత్ర తంత్రాదులూ మాస సంవత్సరాదులూ - ఋతు వులూ - తేజోబల వ్యవసాయాది భావాలూ దండనీతి జ్ఞాన మౌనాది గుణాలూ ఇలా చూస్తూపోతే దేవ దానవ మానవులూ వారి లోకాలూ అందులో వారి విద్యా వివేక బల
Page 348