#


Index

విభూతి యోగము

అనుభవానికి తెచ్చుకొనే అవకాశ మెంతైనా ఉంది. అందుకే అవ్యక్తమైన పరమాత్మ శక్తి వ్యక్తమయి మన దాకా వచ్చి కనిపిస్తున్న దంటారు ఆగమ శాస్త్ర వేత్తలు. ఇందులో గుప్తమయిన అధ్యాత్మ రహస్యమేమంటే నానా విధాలుగా కనపడే సృష్టి చివరకు ఈ అనేకత్వం ద్వారా ఆ ఏకైకమైన సృష్టి కర్త స్వరూపాన్ని అందుకోటానికే. అంటే ఏమన్న మాట. ఈ విభూతి ద్వారా విభువైన పరమాత్మను సాధకుడు తనకు అభిన్నంగా దర్శించటానికే. అదే విభూతి వర్ణనలోని తాత్పర్యం.

  ఇక్కడికి విభూతి యోగం లాంఛన ప్రాయంగా సమాప్తమైనా దానిమీద మనం చేయవలసిన మీమాంస మాత్రమింకా మిగిలి ఉంది. అది కూడా సాగించి దీని సారాంశ మేమిటో తేల్చుకొంటే గాని పరిసమాప్తం కానేరదు. అదేమిటో చూద్దాము. మొట్టమొదట స్వామివారు తన విభూతి విస్తారం చెబుతానని ప్రతిజ్ఞ చేసి ఏ కొన్ని మాత్రమో చెప్పి మిగతావి ఎందుకు చెప్పలేదు. అన్నీ చెబుతానని ఆయన ప్రతిజ్ఞ చేశాడని నీకూ నాకూ అనిపిస్తున్నదేమో గాని అలా చేయలేదాయన. నా విభూతి అసంఖ్యాకంగా అనంతంగా ఉంది. అయితే అడిగావు కాబట్టి అందులో ప్రధానమైన వేవో అవే చెబుతానన్నాడు. అది మరచిపోగూడదు మనం. అంతేకాక అర్జును డాయనను ఏయే భావాలలో పట్టుకోవాలో చెప్పమని గదా అడిగాడు. దానికి తగినట్టుగానే ముఖ్యమైన ఆయా భావాలు మాత్రమే బయట పెట్టాడాయన. కాని అదే అంతమాత్రమే ఆయన విభూతి అని అపోహ

Page 347

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు