విభూతి యోగము
భగవద్గీత
పోతే ఇంకా మూడు పాదాలున్నాయి నీకే మాత్రమూ అంతుపట్టనివి. పాదోస్య విశ్వాభూతాని త్రిపాద స్యామృతం దివి. అని ఈ భావమే పురుష సూక్తం చాటి చెబుతున్నది. నాలుగు పాదాలలో ఒక పాదమేనట ఈ సమస్తమైన చరా చర ప్రపంచమూ. పోతే త్రిపాత్ అంటే మిగతా మూడు పాదాలూ మనకు కనపడటం లేదు. ఇది మృతమైతే అది అమృత మంటున్నది వేదం. మృతమేమిటి. అమృతమేమిటి. వ్యక్తమయి కనిపించేది మృతం. అంటే నామరూపాత్మకం కాబట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంది. చివరకు కనపడకుండా మాసిపోతుంది. అంటే అసలే అభావమయి పోతుందని గాదు. వ్యక్తమైన ప్రపంచ మవ్యక్త మయి పోతుందని భావం. అదే పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ రూపంగా భావిస్తారు మంత్ర శాస్త్రజ్ఞులు. పారమేశ్వరమైన మాయా శక్తి ఆయనతో కలిసి అవినాభావంగా ఉంటే పర. పరాస్య శక్తిః అని గదా శ్వేతాశ్వతరం చెప్పింది. పోతే అది ఈశ్వర సంకల్ప బలంతో వ్యక్తమైన సృష్టిగా మారాలని భావిస్తే అది పశ్యంతి. అదే సృష్టి కుపక్రమించి అవ్యక్తం నుంచి వ్యక్తమైన దశకు వస్తే అది మధ్యమం. చివరకు వ్యక్తంగా మారి కనిపిస్తే వైఖరి. వైఖరీ రూపమైన మహాశక్తే ఇప్పుడీ భగవద్విభూతిగా మనకు దర్శన మిస్తున్నది. దృష్టమైన దీనిని ఆలంబనంగా చేసుకొని తిరుగు ప్రయాణం చేయగలిగితే మానవుడి బుద్ధి మరలా ఆరోహణ క్రమంలో మధ్యమా పశ్యం తీ భూమికలు దాటి పరాశక్తి నందుకొని దాని కధిష్ఠానమైన పరమాత్మనే తన ఆత్మగా
Page 346