విభూతి యోగము
భగవద్గీత
చిన్నపిల్లల నెక్కడికైనా తీసుకుపోయి ఎక్కడైనా తిప్పుతుంటే కనపడ్డవన్నీ అపురూపంగా చూస్తూ అలాగే నిలబడిపోతారు. అందుకే వారిని భగవత్స్వరూపులని పేర్కొంటారు పెద్దలు. పెద్దలు కూడా అపురూపమైన దృశ్యాలను చూస్తూపోతే చిన్నపిల్లల లాగే ప్రవర్తిస్తారు. అదే సృష్టి కర్త మహిమ. ఆయన విభూతి.
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున
విష్ట భ్యాహ మిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్ - 42
అంతా చెప్పి ఆఖరు సారిగా ఒక అద్భుతమైన మాట అంటా డర్జునుడితో పరమాత్మ. అథవా బహునైతేన కింజ్ఞాతేన తవ - ఎందుకర్జునా నేనింతగా వర్ణించి చెప్పటం నీవు చెవులప్పగించి ఆకర్ణించటం. ఇంతగా నేను చెప్ప నక్కర లేదసలు. ఇన్ని పదార్థాలను వర్ణించి చెప్పనక్కర లేదు. అసలీ చెప్పినదంతా ఇంతే ఇక ఏమీ లేదనుకోకు. ఇది సావశేషమే. నిరవ శేషం కాదు సుమా. నిరవశేషంగా చెప్పేలాగా అయితే అసలు రహస్యం బయట పెడుతున్నాను విను మరి. విష్ట భ్యాహ మిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్ - ఇప్పుడీ జగత్తని నీవేది చూస్తున్నావో ఇదంతా నాలుగు వంతులలో ఒక వంతు మాత్రమే. కేవల మొక్క పాదంతో నేనీ చరాచర జగత్తునంతా పట్టుకొని నీకు కనిపిస్తున్నాను. ఇంతవరకూ చిలువలు పలువలు పెట్టి నేను బ్రహ్మాండంగా వర్ణించినదంతా నాలో ఏక దేశమే Part. నాలుగు పాదాలుగా విస్తరించిన నా స్వరూపంలో ఒక పాదం మాత్రమే. దాన్నే నా విభూతి అని చూస్తున్నావు నీవు.
Page 345