విభూతి యోగము
భగవద్గీత
ఏమి కారణం. అచేతనమైన శిల అనిపించదది. జీవకళ ఉట్టిపడే సజీవమైన ఒక మహా పురుషుడే మన ఎదుట నిలుచొని మనలను పలకరిస్తున్నాడని తోస్తుంది. అదే విభూతి అదే శోభ అదే ఊర్జిత మనే మాటల కర్థం.
పోతే అలాంటిదెప్పుడు హఠాత్తుగా దర్శనమిస్తుందో అది సృష్టి చేసిన సృష్టి కర్త అనన్యాదృశమైన జ్ఞాన శక్తీ క్రియా శక్తీ అందులో మనకు కొట్ట వచ్చినట్టు భాసించకపోవు. ఆయన అసాధారణమైన శక్తికది ఒక మచ్చుతునక అనిపించటమే గాక అందులో ఆయన స్వరూప మద్దంలో కనిపించినట్టు మానవుడి మనోనేత్రానికి సాక్షాత్కరిస్తుంది. అందుకే అంటున్నాడు. పరమాత్మ మమ తేజోంశ సంభవమని. అంతా ఆయన మహిమే అయినా ఒకానొక చోట ఒకానొక రూపంలో అది ఉల్బణంగా మనోహరంగా సాక్షాత్కరిస్తుంటుంది. తద్వారా భగవత్తత్త్వ మెలాటిదో ఎంత పరిపూర్ణమో అదే మనకు చాటి చెబుతుంది. అందుకే దాన్ని మిగతా వాటికంటే అంత విశిష్టంగా సృష్టి చేయటం. కనుకనే ప్రాధాన్యతః ఉద్దేశతః అని ప్రత్యేకించి వర్ణించటం భగవానుడు. ఇలాటి ఈశ్వర స్పృహ మనకు మనసులో ఉదయించ టానికే సుమా. సర్వసామాన్యంగానే ప్రతి ఒక్కటీ కనిపిస్తే అలాటి స్ఫూర్తి మన కేర్పడక పోవచ్చు. ఉత్తమాధికారికైతే సామన్యంలోనే అసామాన్యమైన దృష్టి ఉదయించవచ్చు. కాదన లేము. కాని అందరూ ఉత్తమాధికారులు కారు గదా. మందమధ్యములే గదా నూటికి తొంబదిమంది. ఇప్పుడు కూడా చూడండి.
Page 344