#


Index

విభూతి యోగము భగవద్గీత

మమ తేజోంశ సంభవం నా చైతన్య ప్రకాశమే ఒకానొక అంశ అక్కడ ఉల్బణంగా చేరిపోయినట్టు పోగయి ఆరూపంలో కనపడుతున్నట్టు తత్త దేవావ గచ్ఛత్వం. నీవెప్పుడూ అర్ధం చేసుకోమంటున్నాడు.

  నిజమే. మన దైనందిన జీవితంలోనే చూస్తుంటాము మనమిలాంటి సందర్భాలెన్నో. ఉన్నట్టుండి ఒక పర్వతాన్నో సముద్రాన్నో అరణ్యాన్నో పట్టణాన్నో ఎప్పుడో ఒకప్పు డపురూపంగా చూచామను కోండి. అంతకు ముందెప్పుడూ చూడని అద్భుతమైన దృశ్య మొక్కసారిగా కంటికి కనిపించేసరి కాశ్చర్య పోతాము. ఆనందంతో ఉత్సాహంతో పరవశమై పోతాము. ఏమి కారణం. అంతకు ముందెప్పుడూ అలాటివి చూడకనా. చూచే ఉంటాము. కాని అంత విస్తారమైనదీ ఉత్కృష్టమైనదీ కాకపోవచ్చు. ఇంతెందుకు. ఒక చెరువో నదో చూచే ఉంటామది మన కలవాటే. కాని సముద్రాన్ని చూడకపోవచ్చు. చిన్న చిన్న కొండలెన్నో చూచి ఉంటాము. కాని ఆకాశమంటే శిఖరాలు గల ఒక హిమాలయాన్ని చూడకపోవచ్చు. అతి పరిచయా దవజ్జా అన్నట్టు అలవాటయిన స్వల్పమైన దంతగా మనలనా కర్షించదు. ఆ జాతిలోనే చాలా ఉన్నతమైనదీ విశాలమైనదీ ఒక్కసారిగా చూస్తే మురిసిపోతాము. పదే పదే చూడాలని కూడా ఉబలాట పడతాము కూడా. అంతెందుకు ఎన్నో గుళ్లున్నాయి. విగ్రహాలున్నాయి. కాని ఒక బృహదీశ్వరాలయం లాంటి దేవాలయం చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఒక వేంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.

Page 343

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు