సూచన చేయటానికే ఈ అడ్డదిడ్డమైన వ్యవహారం. ఇదే ఇలా కలగాపులగం చేసి ఈ విభూతిని వర్ణించటంలో ఉన్న ఆంతర్యం. ఎలా వర్ణిస్తేనేమి. ఒక వరసలో వర్ణిస్తే నేమి. వరస తప్పించి వర్ణిస్తే నేమి అంతా అబద్దమే అయినప్పుడు. ఇది అబద్దమని ఇలా మేము వరస తప్పించి వర్ణించటంలోనే మీరు గ్రహించి నిబద్ధమైన ఆ తత్త్వాన్ని దీనిద్వారా అందుకోండని సూచించటమే మా వివక్షితమని వ్యాసభగవానుడిలా భంగ్యంతరంగా ఒక సాధన రహస్యాన్ని కూడా బయటపెడుతున్నాడు. ఇదుగో ఈ మూడు ముఖ్యాంశాలూ మనసుకు పట్టించుకొంటే విభూతి యోగమనే ఈ అధ్యాయ సారాంశం మనం నూటికి నూరుపాళ్లూ గ్రహించిన వాళ్ల మవుతాము.
ఇతి
విభూతి యోగః సమాప్తః
Page 352