#


Index


ఉపసంహారము

గుడాకేశ సర్వభూతాశయ స్థితః - నేనే సమస్త ప్రపంచానికీ ఆత్మ స్వరూపుణ్ణి. సమస్త ప్రాణి కోటిలో నేను నేను అనే స్ఫురణ కూడా నేను. దీన్ని బట్టి జీవుడు వేరే లేడు. వాడు పరమాత్మ స్వరూపుడేనని తెలిసిందా లేదా. అలాగే అహ మాది శ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ అనటం మూలంగా జగత్తంతా ఆయన స్వరూపమే ననీ తేటపడింది గదా. ఇక పరమాత్మ కానిదేముంది.

  అయినా జీవుడికి పట్టిన జిడ్డు అంత సులభంగా వదలి పోదు. విశ్వమంతా ఆయనేనని చాటుతున్నా దాన్ని అలాగే ఆకళించుకొనే సామర్థ్యం లేదు మన బుద్ధికి. కనుక మన బుద్ధులకు తగినట్టు అడుగుతుంటాము. కేషు కేషుచ భావేషు చింత్యోసి. అంతా నీవే అయినా ఏయే భావాలు చాలా ముఖ్యమైనవీ సృష్టిలో. ఏ భావాలలో నిన్ను మేము దర్శించాలని వీడి తాపత్రయం. దాని కనుగుణంగానే బోధిస్తాడు మనకాయన. నేను పర్వతాలలో ఇది పట్టణాలలో అది అని. మిగతా పదార్ధాలు నీవు కావా అంటే అదీ చెబుతాడు కడపట న తదస్తి వినాయత్ స్యా న్మయా భూత మని. అంతా నా స్వరూపమే నేను కాని దేముందంటాడు.

  ఇంత నచ్చజెప్పినా ఇంకా అర్థం కాక అడుగుతూనే పోతాడు మానవుడు. వాడికి పట్టుకొన్న మాలిన్యమలాంటిది. ఏమి చేస్తాడు పాపం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు