#


Index


ఉపసంహారము

దాన్ని కూడా క్షాళనం చేయాలి వీడే. అప్పుడు తాను ప్రత్యగాత్మ అయినట్టే ఆయన పరమాత్మగా భాసిస్తాడు. అదే తత్పదార్ధ శోధన. శోధన అనటం కన్నా బోధన అని నిర్దేశించటం మంచిదేమో. ఎందుకంటే ఈశ్వరుడిలో మనం చేయిపెట్టి కడిగేసేది కాదా మాలిన్యం. మనమా తత్త్వాన్ని అలా భావించటమే మాలిన్యం. కనుక మన బుద్ధి శుద్ధి అయితే చాలు. అది కూడా శుద్ధంగానే కనిపిస్తుంది మన దృష్టికి. అంచేత బోధనే ఇక్కడ శోధన.

  అది ఇప్పుడెలా జరగాలో నిరూపిస్తున్నదీ ద్వితీయ షట్కం. ఏడవ అధ్యాయం దగ్గరి నుంచి పన్నెండవ అధ్యాయం వరకూ జరిగిందిప్పుడు తత్పదార్థ శోధనే. ఏడవది జ్ఞాన విజ్ఞాన యోగం. దానితో మొదలయింది శోధన మార్గం. ప్రపంచ సృష్టిని వర్ణించాడక్కడ గీతాచార్యుడు. దానికి నేను కాను నా ప్రకృతి కారణమన్నాడు మొదట పరమాత్మ. అది పర అపరమని రెండు విధాలు. అపరం వల్ల పృధివ్యాది జగత్తు సృష్టి అయితే పర జీవ రూపంగా పరిణమించింది. అలా వర్ణించి మరలా ఆ ప్రకృతి నాకంటే వేరుగా లేదు. ప్రకృతి సృష్టించిందనే మాటే గాని సృష్టి కర్తను నేనేనని చాటుతాడు. ఇంతకూ ప్రకృతా నీవా అని అడిగితే ప్రకృతి ఉపాదానం నేను నిమిత్త మన్నట్టుగా చూపి రెండూ మరలా తానే అయినట్టు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు