మారే స్వభావ ముండి తీరాలి. అదే ఆయనతో అవినాభూతంగా ఉన్న ప్రకృతి లేదా మాయా శక్తి. అది తానే ఒప్పుకొన్నా డాయన. మాయాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమని ఏతద్యోనీని భూతాని అని.
మొత్తం మీద ఏరాయైతే నేమి పండ్లూడ గొట్టుకోటానికి. తన బలం వల్లనో మన బలహీనత వల్లనో వాస్తవంగా బ్రహ్మ స్వరూపమే అయినా అది మనకు కార్య బ్రహ్మమయి కనిపిస్తున్నది. అదే ఈశ్వరుడు God . దీనివల్ల జగత్తుకు సృష్టి స్థితిలయాదులు చేయవలసి వచ్చింది. అంతేగాక సమష్టి రూపంగా హిరణ్య గర్భుడు గానూ వ్యష్టి రూపంగా అస్మదాది జీవరూపంగానూ అవతార మెత్త వలసి వచ్చింది. ఇదే పరమాత్మకు పట్టిన మాలిన్యం. శాస్త్రీయమైన భాషలో చెబితే తత్పద వాచ్యార్ధమిది. వాచ్యార్ధం వాచ్యార్ధంగా ఉన్నంతవరకూ జీవ బ్రహ్మైక్యం జరగటం కల్ల. జీవుడెలా జీవాత్మ స్థాయి నుంచి ప్రత్యగాత్మ స్థాయి నందు కోవాలో ఈశ్వరుడు కూడా పరమాత్మ స్థాయి నందుకోవాలి. అందుకోవాలంటే తన కారోపిత మైన కాలుష్యాన్ని కడిగేసు కోవాలి. వస్తుతః ఆయన ఏదీ ఆరోపించుకో లేదు కాబట్టి కడిగేసు కోవలసిన డ్యూటీ ఆయనకు లేదు. అనవసరంగా ఆయన కారోపించిన వాడీ జీవుడే కాబట్టి వీడు తన మాలిన్యాన్ని ఎలా కడిగేసుకోవాలో అలాగే ఆయనకు తాను తగిలించిన