
బుద్ధి సిద్ధంగా. నిర్గుణుడుగా ఉన్నంత వరకూ పరమాత్మే బ్రహ్మమే. అప్పుడాయన నిరుపాధికమైన సత్యం. నిరాకారం. సర్వవ్యాపకం. స్వతః ప్రమాణం. స్వతస్సిద్ధం. ఆయనకే ఈ గుణాలతో సంపర్క మేర్పడేసరికి సోపాధికం సాకారం సగుణంగా మారి సర్వలోకాలకూ ఆధిపత్యం వహించ వలసి వచ్చింది. జీవ జగత్తులు తనకు భిన్నంగా తయారయితే వాటి కధీశుడై వాటి సృష్టి ప్రవేశాదులనే బాధ్యత పెట్టుకోవలసి వచ్చింది. తనకు సహజం గాకపోయినా జీవు డ సహజంగా తన మీద ఆరోపించిన వ్యవహారమిది.
అయితే స్వతహాగా తనకు లేనిదొకడు ఆరోపించటం మాత్ర మెలా సంభవం. అజ్ఞానాంధ కారంలో కొట్టు మిట్టాడే ఈ జీవుడాయన కిదంతా ఎలా ఆరోపించ గలడని శంకించవచ్చు. అదీ వాస్తవమే. జీవుడొక్కడే ఇంత పని చేయలేడు. మరేమి టంటారు. పరమాత్మ కూడా షరీకయ్యాడీ జీవుడితో. అది ఎలాగని ఆశ్చర్య పడనక్కర లేదు. ఒకరజ్జువు మన అవిద్య వల్ల సర్పాకారంగా కనిపించిందంటే అందుకు మన దృష్టి దోషమొక్కటే కారణం కాదు, రజ్జు దోషం కూడా. మనమలా చూచినా రజ్జువులో సర్పంగా కనిపించే స్వభావ మంతర్గతంగా లేకుంటే అలా కనిపించగలదా. అలాగే జీవుడు భ్రాంతి పడి చూచినా పరమాత్మకు కూడా సగుణమైన ప్రపంచంగా
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు