#


Index

ఉపసంహారము

ఉపసంహారము

  గీతలో రెండవ షట్కం కూడా ఇక్కడికి సమాప్తమయింది. తత్త్వమసి వాక్యార్ధం భగవద్గీతకు సమన్వయించి గదా చెప్పుకొంటూ వచ్చాము. అందులో మొదటి షట్కంలో త్వం పదార్థాన్ని శోధన చేసి చూపాము. జీవుడే గదా త్వం పదార్థమంటే. అది శుద్ధి చేయనంత వరకూ జీవాత్మ. శుద్ధి అయితే ప్రత్యగాత్మ. ప్రత్యగాత్మ స్థాయి కెదిగితే అది పరమాత్మ నందుకోటానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నాము. పోతే ఇప్పుడిక పరమాత్మే సిద్ధం కావలసింది. సిద్ధం కావాలంటే అది కూడా శుద్ధి అయి తీరాలి. పరమాత్మకు శుద్ధేమిటి. ఆయన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడని గదా శాస్త్రం వర్ణించింది. నిజమే. వస్తుతః అది శుద్ధమైనదే ఆతత్త్వం. దానిపాటికది ఎప్పుడూ అశుద్ధి పాలుగా లేదు.

  అయినా అశుద్ధి అనేది తన పాటికి కాకపోయినా జీవుడి మూలంగా ఏర్పడింది దానికి. జీవుడు తాను అవిద్యామూలంగా మలిన స్వభావుడయి అలాటి మాలిన్యాన్నే పరమాత్మకు కూడా కొంచెమో గొప్పో ఆరోపించి కూచున్నాడు. అదేదో గాదు. నామరూపక్రియలనే గుణాలు. వాటివల్ల పరమాత్మ ఈశ్వరుడుగా మారిపోయాడు. వస్తుసిద్ధంగా కాదు. మానవుడి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు