
ధర్మాన్వితమూ - అమృతమూ అయిన ఈ బ్రహ్మాత్మ జ్ఞానం విడవకుండా నిత్యమూ అభ్యసిస్తూ పోవటమెంతో ఆవశ్యకం. ఫలితాన్ని బట్టి ఉంటుంది ప్రయత్నమనేది. ఫలితమెంత గొప్పదైతే అంత గొప్పగా ఉంటుంది ప్రయత్నం. అన్నిటికన్నా పరమమైన ధామం గదా చేరాలని చూస్తున్నాడీ సాధకుడు. మరి దాని కనుగుణంగా అంత గొప్ప సాధన చేయకుంటే ఎలాగా. అదే జ్ఞాన సాధన. అని భరత వాక్యం పలుకుతున్నారు. భాష్యకారులు.
ఇతి భక్తి యోగః సమాప్తః
Page 543
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు