#


Index

భక్తి యోగము

వాడైన జ్ఞానే ఇక్కడ భక్తుడంటే. వాడూ భక్తుడైనా పరమార్ధ జ్ఞాన లక్షణమైన భక్తి వాడిది. అదే అనన్యమైన భక్తి. విశ్వరూపాధ్యాయం చివరలో వస్తుందీ మాట. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం. విధో ర్జున అని. అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను గ్రహించటానికీ దర్శించటానికీ నాతో తాదాత్మ్యం చెందటానికీ మార్గం మరొక మార్గమే లేదంటాడు భగవానుడు. ఇదుగో అలాటి అనన్య భక్తి అనే పేరుగల ఆత్మ జ్ఞానమే ఇక్కడ భక్తి అని మహర్షి వివక్షితం.

  ఇంతకూ ప్రియోహి జ్ఞానినోత్యర్థ మితి య త్సూచితం తత్ వ్యాఖ్యాయ ఇహ ఉపసంహృతం భక్తాస్తే తీవమే ప్రియా ఇతి. జ్ఞాని అయిన వాడు నాకు చాలా ఇష్టుడని భగవానుడింతకు పూర్వమేది సూచన చేశాడో అదే ఇక్కడ చక్కగా వివరించి ఉపసంహరించాడు భక్తాస్తే తీవమే ప్రియాః అలాటి భక్తులే నాకిష్టులని మరలా. యస్మాత్ ధర్మ్యామృత మిదం యధోక్త మనుతిష్ఠన్ భగవతో విష్ణోః పరమేశ్వరస్య అతీవ ప్రియో భవతి. కాబట్టి ధర్మ్యా మృతమైన దీన్ని విడిచి పెట్టకుండా అభ్యసిస్తూ పోతే సర్వవ్యాపకుడూ సర్వేశ్వరుడూ అయిన పరమాత్మకు చాలా ఇష్టుడనిపించుకొనే అవకాశముంది. తస్మాత్ ఇదం ధర్మ్యామృతం ముముక్షుణా యత్నతః అనుషేయం విష్ణోః ప్రియం పరంధామ జగమిషుణా ఇతి వాక్యార్ధః అంచేత

Page 542

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు