#


Index

భక్తి యోగము

వీడు చేయవలసిన అనుష్ఠానం. అంతకన్నా వేరే అభ్యాసమంటూ ఏదీ లేదు.

  అయితే అది ఎంత మానసిక మైన సాధన అయినా బాహ్యం కాకపోయినా అంత సులభంగా వచ్చి మన ఒడిలో పడేది గాదు. శ్రద్ద ధానా మత్పరమాః భక్తాః బ్రహ్మాండమైన శ్రద్ధ ఉండాలి మొదట. అది ఎలాగైనా సాధించాలా జ్ఞానమనే దీక్షకే శ్రద్ధ అని పేరు. శ్రద్ధా వాన్ లభతే జ్ఞానమని గదా ఇంతకు ముందే సెలవిచ్చాడు గీతాచార్యుడు. రెండవది మత్పరమాః యధోక్తః అహం అక్షరాత్మా పరమః నిరతిశయా గతిః యేషాంతే మత్పరమాః అని వ్యాఖ్యానిస్తారు గురువుగారు. సర్వత్రగ మచింత్యమని ఎంతో దూరం వర్ణిస్తూ వచ్చిన అక్షర రూపుడనైన నేనే నిరతి శయమైన గమ్యంగా పెట్టుకొని దానినే తమ కనన్యంగా భావించే వారెవరో వారు మత్పరములంటే.

  సగుణ భక్తులు కూడా అలాటి శ్రద్ధాళువులూ భగవత్పరాయణులే గదా అని భావించవచ్చు. కాని వారు గాదిక్కడ మేము ప్రస్తావిస్తున్న భక్తులు. మద్భక్తా అంటే నిర్గుణ భక్తులని అర్థం. అదే వ్రాస్తున్నారు భగవత్పాదులు. మద్భక్తా శ్చ ఉత్తమాం పరమార్ధ జ్ఞాన లక్షణాం భక్తి మాశ్రితాః - ఆర్తో జిజ్ఞాసుః అని ఇంతకు పూర్వం వర్ణించిన చతుర్విధ భక్తులలో నాలుగవ

Page 541

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు