భక్తి యోగము
భగవద్గీత
నిష్ఠానాం ధర్మజాతం ప్రక్రాంత ముపసంహ్రియతే. అక్షరో పాసకులయి నివృత్తైషణులయి పరమార్ధ జ్ఞాన నిష్ఠా పరులైన సన్న్యాసుల లక్షణాలు గదా వర్ణిస్తూ వచ్చింది గీత. అది ఇప్పుడుప సంహరిస్తున్నది. ఏమని.
యేతు ధర్యామృత మిదం యధోక్తం పర్యుపాసతే
శ్రద్ధ ధానా మత్పరమా భక్తా స్తే తీవమే ప్రియాః - 20
ఎవరైతే మేమింత వరకూ వర్ణించి చెప్పిన ధర్మ్యామృతమైన ఈ జ్ఞానాన్ని కేవలం సిద్ధాంత రూపంగా గాక పర్యుపాసతే ఆచరణలో పెడతారో. ధర్మ్యమేమిటి. అమృతమేమిటి. ప్రవృత్తి రూపం గాక నివృత్తి రూపమైనది కాబట్టి మోక్ష ధర్మమిది. దీనిమూలంగా మానవుడికి లభించేది అమృతం. మృతుణ్ణి కాకుండా చేసేది కాబట్టి అమృతం. మోక్షమని అర్థం. ఇలాటి మోక్షధర్మమే అద్వేష్టా సర్వభూతానామని ఆరంభించి ఇంతవరకూ మేము వర్ణించింది. ఇది శ్రవణం చేసి అక్కడి కయి పోయిందని ఊరక కూచోటం కాదు. అది మననం చేయాలి. ఆ తరువాత నిదిధ్యాసన సాగించాలి. దీనికే పర్యుపాసన మని నామాంతరం. అంతేగాని అది ఏదో ఆచరించ మన్నారు గదా అని కర్మ భక్తి సమాధి యోగాల ధోరణిలో ఏదో బాహ్యమైన అనుష్ఠానం చేద్దా మనుకోరాదు. జ్ఞాని లక్షణాలని ఏవి చెప్పారో అవే జ్ఞాన సాధకుడైన వాడు ప్రయత్న పూర్వకంగా అలవరుచుకోవాలని భావం. అదే
Page 540