#


Index

భక్తి యోగము

ధీనమైన జీవితం జీవిస్తుంటాడు జ్ఞాని భౌతికంగా. ఆధ్మాత్మికంగా బ్రహ్మాధీనమైన జ్ఞాన జీవితం సాగిస్తుంటాడు. జోడు గుఱ్ఱాల స్వారి జ్ఞాని జీవితం.

  అనికేతః స్థిరమతిః - అదే మరో భాషలో వర్ణిస్తున్నాడు మహర్షి ఫలానా ఆశ్రయం నివాసమంటూ లేదు జ్ఞానికి. పరివ్రాజకుడై ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు శారీరకంగా. అలాగని మనసు కూడా దానితో పాటు తిరుగుతుంటుందని భావించరాదు. స్థిరమతిః - మానసికంగా ఒకే ఒక లక్ష్యం మీద దృష్టి పెట్టుకొని నిశ్చలంగా ఉంటాడు. ఒకే ఒక లక్ష్యమంటే ఇది యోగుల సమాధి అని భ్రాంతి పడరాదు మరలా. యోగుల లక్ష్యం వేరు. జ్ఞానుల లక్ష్యం వేరు. యోగులెక్కడో ఒకచోటనే పెడతారు దృష్టి. మిగతా చోట్ల పెట్టరు. జ్ఞానులలా కాక మొత్తం ప్రపంచమంతా ఆత్మ స్వరూపమే ననే దృష్టితో చూస్తుంటారు కాబట్టి అంతటా వ్యాపించిన లక్ష్యం వారిది. అంతేకాదు. యోగులు తమ లక్ష్యాన్ని తమకు భిన్నంగా చూస్తారే గాని అభిన్నంగా దర్శించరు. జ్ఞానులలా కాక ప్రతి ఒక్క చోటా తమ స్వరూపమే ఉన్నట్టు దర్శిస్తారు కాబట్టి తమ కభిన్నమే ప్రతి ఒక్కటీ.

  ఇక్కడికి సమాప్త మయింది అక్షరోపాసకులైన జ్ఞానుల వ్యవహారం. భగవత్పాదులు వ్రాస్తున్నా రవతారిక. అద్వేష్టా సర్వభూతానా మిత్యాదినా అక్షరోపాస కానాం నివృత్త సర్వైషణానాం సన్న్యాసినాం పరమార్ధ జ్ఞాన

Page 539

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు